బీజేపీలో చేరిన తీన్మార్ మ‌ల్ల‌న్న ఏదో హిందీలో మాట్లాడ‌దామ‌ని ట్రై చేసి న‌వ్వుల‌పాల‌య్యాడు. అదేదో తెలుగులో మాట్లాడిన అయిపోయేదేమో…? వ‌చ్చీ రానీ ఇంగ్లీష్‌లో నెట్టుకొచ్చినా బాగుండేదేమో..? కానీ ఢిల్లీలో హిందీలో మాట్లాడ‌క‌పోతే ఎట్లా ..? అనుకున్నాడేమో.. ఈ స‌భ్య‌త్వం న‌హీ హై… ఏ తాడు హై.. పంద్రా మీట‌ర్ కా ర‌స్సీ హై… అమ‌ర‌వీరుల స్థూపం కే పాస్ బాంద్ దేతా హు.. అని ఏదేదో త‌న స‌హ‌జ శైలిలో చీల్చి చెండాడేశాడు. కానీ ఆ హిందీ భాషే ఒక ప‌ట్టాన నాలిక‌మీద ఆడ‌లేదు. దొర‌క‌లేదు. నాలిక మ‌డ‌త ప‌డింది. ఏదో చెప్తామ‌నుకున్నాడు. తెలుగు, హిందీ.. హిందీ-తెలుగు క‌ల‌గ‌లిపిన భాష‌తో కేసీఆర్‌ను , కేసీఆర్ ఫ్యామిలీని చీల్చి చెండాడాడు. ఆ త‌ర్వాత నెటిజ‌న్లు తీన్మార్ మ‌ల్ల‌న్న‌తో ఆడుకున్నారు. ఇదేం హిందీరా నాయ‌న‌.. మీరు బ‌హుభాషా కోవిదులు రా బాపు.. అని వ్యంగ్య బాణాలు సంధించారు. ప‌నిలో ప‌ని బండి సంజయ్‌ను లాక్కొచ్చారు. అర్వింద్‌నూ వ‌ద‌ల్లేదు.

https://m.facebook.com/story.php?story_fbid=936309567318828&id=100028193809897

https://fb.watch/9LOUF4n1mX/