న‌మ‌స్తే తెలంగాణ గురించి ఓ పాఠ‌కుడు.. ఓ అభిమాని పంపిన లేఖ‌.. య‌థాత‌థంగా..

………………………………………………………………………………………………….

మన రాష్ట్రం…మన పత్రిక పేరుతో ఆవిర్భావం చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో నిజామాబాద్ ఎడిషన్ లో చాలా తప్పులు చోటు చేసుకుంటున్నాయి.

9వ తేదీన కామారెడ్డి జిల్లా బీబీ పేట మండల కేంద్రంలో పర్యటించిన మంత్రుల కార్యక్రమం 10వ తేదీన నిజామాబాద్ ఎడిషన్ మెయిన్ పేజీ 1, 2లో తప్పులు చాలా వచ్చాయి. వాటిని మీ దృష్టికి తీసుక వస్తున్నాము.

నిజామాబాద్ మెయిన్ మొదటి పేజీలో మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు కామారెడ్డి జిల్లా బీబీపెట్ మండలం కేంద్రంలో పర్యటించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఈ వార్త తప్పుగా వచ్చింది. ప్రారంభించిన ఫొటోలో బీబీ పెట మండలం జనగామ అని తప్పుగా వచ్చింది. మంత్రులు కేటీఆర్ సబితారెడ్డి, ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. కానీ బీబీ పేటలో కార్యక్రమంలో జరగ్గా, జనగామ అని తప్పుగా ప్రచురించారు.

నిజామాబాద్ ఎడిషన్ మెయిన్ పేజీ 2లో కూడా మళ్లీ అదే తప్పులు దొర్లాయి. దాత సుభాష్ రెడ్డి దంపతులను సన్మానించిన ఫొటో లో కూడా బీబీ పెట మండల కేంద్రం బదులుగా జనగామ అని వచ్చింది.

ఫొటో రైటప్ లు రెండు చోట్ల తప్పులు రాగా, మూడవ తప్పు 2వ పేజీ మెయిన్ ఐటమ్లో చోటు చేసుకుంది. నిజామాబాద్ ప్రతినిధి డెడ్ లైన్ కింద వచ్చిన మెయిన్ ఐటమ్ లో కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం జనగామ అని వచ్చింది. కార్యక్రమం జరిగింది, మంత్రులు పాల్గొని పాఠశాలను ప్రారంభించింది మాత్రం బీబీ పేట మండల కేంద్రంలో జరిగింది.

ఇలాంటి తప్పుల వల్ల నమస్తే తెలంగాణ పత్రిక క్రెడిబిలిటీ దెబ్బ తింటుంది. ఈ రోజు ప్రత్రికారంగంలో ఒకటే చర్చ జరుగుతోంది. నమస్తే తెలంగాణ పత్రిక లో తప్పులు వచ్చాయని చెబుతున్నారు.

You missed