(దండుగుల శ్రీనివాస్)
సాక్షిలో కొత్త ఎడిటర్ రాక తీవ్ర గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టించింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం సాక్షిలో రచ్చ రాజకీయానికి, గ్రూపుల పోకడలను అద్దం పడుతోంది. వర్దెళ్లి మురళీ సాక్షికి గుడ్‌బై చెప్పనుండటంతో అప్పటి వరకు ఏపీకి రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ధనుంజయ్‌రెడ్డికి తెలంగాణ, ఏపీ ఎడిటర్ బాధ్యతలను అప్పగించాడు వైఎస్ జగన్. జగన్‌కు ధనుంజయ్ చాలా దగ్గర. ఆంధ్ర ప్రాంతం వాడు. ఇప్పుడు కొత్తగా అక్కడ ప్రాంతీయ లొల్లి రాజుకుంది.
మురళి ప్లేస్‌లో కొత్తగా వచ్చే ధనుంజయ్ మాకొద్దంటూ.. ఆంధ్ర ఎడిటర్‌ను అంగీకరించమంటూ కరపత్రాలు కూడా కొట్టి పంచడం ఆ పత్రిక మేనేజ్‌మెంట్‌లో, స్టాప్‌లో తీవ్ర కలకలం రేపింది. దీని వెనుక ఎవరున్నారనే ఆరా … దోషులెవరో తేల్చుకునే పనిలో రాజకీయాలు అక్కడ ఓ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిపెట్టాయి. దాదాపు పత్రిక ఆరంభం నుంచి ఎడిటర్‌గా కొనసాగిన మురళీ… తన టీమ్‌ను అక్కడ పెంచి పోషించాడనే ప్రచారం ఉంది. దీంతో షరా మామూలుగా దీనికి కొత్త ఎడిటర్ చెక్‌పెడతాడని కూడా భయం పట్టుకుంది.
ఆ మేరకు విస్తృత ప్రచారమూ జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఇన్చార్జిలపై అప్పుడే నిఘా మొదలైంది. ఎవరెవరు ఎంతెంత గుంజారు..? ఎక్కడెక్కడ లాగారు..? ఎవరి అవినీతి ఎంత…? అనే విషయాలపై ఏసీబీ ఎంక్వైరీ కూడా చేసినట్టుగా పకడ్బందీ గా ఆరా తీసి.. వారి అంతు చూసే పనిలో ఉన్నాడట కొత్త ఎడిటర్. దీంతో సహజంగానే అక్కడ తిష్టవేసిన ఇన్చార్జిల లోకానికి భయం పట్టుకుంది. ఇప్పుడక్కడ పరిస్థితి ఎప్పుడు ఎవరు ఎగురుతారో..? ఏ వార్త వినాల్సి వస్తుందోననే భయాందోళలనలో మురళీ టీమ్ బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నదట.