Month: November 2024

అసంద‌ర్బోత్స‌వాలు…! విజ‌యోత్స‌వాలు జ‌రుపుకునే స‌మ‌య‌మా సార్ ఇది..! జ‌నాలు క‌ష్టాల్లో ఉన్నారు.. తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు…! హామీల అమ‌లుతో ఆదుకోండి..! భ‌రోసానివ్వండి… రైతుభ‌రోసా రిలీజ్ చేయండి.. రుణ‌మాఫీ సంపూర్ణం చేయండి..! 4వేల పింఛ‌న్ అమ‌లుకు క్లారిటీ ఇవ్వండి… రోమ్ చ‌క్ర‌వ‌ర్తి ఆలోచ‌న‌లు చేయ‌కండి.. !

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇలా ఏడాది పూర్త‌య్యిందో లేదో అలా విజ‌యోత్స‌వాలు జ‌రుపుకోవాల‌ని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ స‌ర్కార్‌. భ‌ట్టి ఇవాళ దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒక‌టి ప్ర‌క‌టించేశాడు కూడా న‌వంబ‌ర్ 14 నెహ్రూ పుట్టిన రోజు నుంచి మొద‌లుకొని డిసెంబ‌ర్ 9…

ఆగ‌మైండ్రు.. అనుభ‌విస్తున్న‌రు…! ఇంకా జ‌నాల‌నే త‌ప్పుబ‌డ్తున్న కేసీఆర్‌…! త‌ప్పైంది.. చెంప‌లేసుకుంటున్నాం.. అని ఓ మాట నోట రావ‌డం లేదా…? ప‌దేళ్ల‌లో సిట్టింగు ఎమ్మెల్యేలు చేసిన అరాచ‌కాలెన్నో నీకు తెల్వ‌దా..? మ‌ళ్లీ మ‌ళ్లీ వాళ్ల‌కే సీట్లివ్వ‌డానికి కార‌ణం నీ అహంకార‌మా? పిరికిత‌న‌మా..? జ‌నం అంటే అంత చిన్న‌చూపా..? మ‌ళ్లీ మ‌న‌దే అధికారం… ఓకే..! కానీ ఇంకా చాలా టైం ఉంది…! మార్పు కోరుకున్న ప్ర‌జ‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌ళ్లీ అవ్వే మాట‌లు కేసీఆర్ నోట‌. త‌న‌ను ఓడ‌గొట్ట‌డ‌మే ప్ర‌జ‌లు చేసిన అతి పెద్ద త‌ప్పిదంలా.. అది వారికి త‌గిన శాస్తి జ‌రిగేదాకా త‌ను క‌ళ్లారా చూడాల‌నే అదే పైశాచిక దోర‌ణే త‌ప్ప ఆయ‌న‌లో ఇంకా మార్పురాలేదు. రాదేమో…

బ‌ర్త్ డే రోజూ పుంగీ బ‌జాయించుడేనా…! హాయిగా ఇంట్లో రెస్టు తీసుకోవ‌చ్చుగా…!! మూసీ మురికి వెంట ప‌రుగులేందీ..? ఆ తిట్లేందీ…! ఆ వార్నింగ్‌లేందీ..? స‌వాళ్ల సంగ‌తేందీ..? ఏందీ…! ఏందీ… మాకీ టార్చ‌ర్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పుట్టిన రోజున కేటీఆర్ మంచిగా విషెస్ చెప్పాడు రేవంత్‌కు. హ్యాపీ బ‌ర్త్‌డే అని. ఆ రోజైనా వ‌ద‌లొచ్చు క‌దా. ఖాళీగా ఉండొచ్చు క‌దా. వ‌చ్చినోళ్ల‌ను కల‌వొచ్చు క‌దా. అంద‌రితో హ్యాపీగా ఉండొచ్చు క‌దా. ఉహూ…! ఆ మూసీ వెంట…

జీతాల కోసం ఫోన్లు సూస్కునుడే స‌రిపోయింది…! ఇట్ల జేస్తే ఈఎంఐలు ఎట్ల క‌ట్టాలె..! మాకే ఇట్ల జేస్తుర్రు… ఇగ జ‌నాల‌కీళ్లేం న్యాయం జేస్త‌రే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) జీతాలు ప‌డ్డ‌యంట క‌దా…. ఏడ ఇంక‌… ముప్పైవేల లోపు జీతాలున్నోళ్ల‌కే ఏసిండ్రు..! అదేందీ అంద‌రికీ ప‌డ‌లే…! ఏమో అంత అడ‌క్క‌తిన్న‌ట్టు చేస్తున్న‌రు… విడ‌త‌ల వారీగా ఏస్త‌రంట‌… మ‌ధ్య‌లో గిట్ల‌నే ఏసిర్రు.. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లు పెట్టిర్రు… ముందే చెప్పిండ్ర‌ట…

మూసీలో ముంచుతా…! బుల్డోజ‌ర్ల‌తో తొక్కిస్తా…!! బిల్లా, రంగా, చార్లెస్ శోభ‌రాజ్‌లు నాతో క‌లిసి పాద‌యాత్ర‌కు రావాలె..! ఇది ట్ర‌య‌ల‌ర్ మాత్ర‌మే…. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో అస‌లు సినిమా చూపిస్తా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చిన్న‌వ‌య‌స్సులో సీఎం అయిన‌. అంద‌రి ఆశీస్సుల‌తో ఈ ప‌ద‌వి ద‌క్కింది. నా జన్మ‌దినం రోజున ఈ మూసీని ప్ర‌క్షాళ‌న చేసే మ‌హాద్బుత కార్య‌క్ర‌మం చేప‌ట్టిన… నా జ‌న్మ ధ‌న్య‌మైంది. ఎవ‌ర‌డ్డొచ్చినా ఆప‌ను. హ‌రీశ్‌, కేటీఆర్‌ల‌ను బ‌ల్డోజ‌ర్ల‌తో తొక్కైనా స‌రే…

పాద‌యాత్ర స‌రే… ప్ర‌క్షాళ‌నా ఓకే…! కానీ ఈ మూసీలో ఆ పూజ‌లేందీ….? ఈ కంపు నీటిలో పూలు, కుంకుమ‌లేందీ…? నీకెవ‌రు స‌ల‌హాలిస్త‌న్నారు రేవంతు….? పుట్టిన రోజున మురికి కూపంలో గ‌డ‌ప‌డం మాత్రం నెవ‌ర్ బిఫోర్‌.. ఎవ‌ర్ ఆఫ్ట‌ర్‌…! కాదంటారా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదేం ఖ‌ర్మ‌రా బై. మ‌నం ఏం అనుకున్నం. ఏం జ‌రుగుతున్న‌ది. సీఎం రేవంత్ అయితే ఏం చేస్తాడ‌ని ఊహించాం.. కేసీఆర్‌కు మించి ఏం వ‌స్త‌ద‌ని ఆశించాం. కానీ ఇప్పుడేమైతున్న‌ది. మ‌న సీఎం మూసి వెంట ప‌డుతున్న‌డు. దానికి పున‌రుజ్జీవం…

రా… నా ఇంటికి రా..! న‌న్న‌రెస్టు చెయ్‌..!! ప్లీజ్ ప్లీజ్ అరెస్టు చేయండి… అరెస్టు చేస్తావా లేదా…! ఇదెక్క‌డి గోల‌రా నాయ‌నా…

(దండుగుల శ్రీ‌నివాస్‌) బాల‌య్య సినిమాలో డైలాగులా ఉంది ఇది. కానీ రివ‌ర్సులో. నీ ఇంటికొచ్చా.. నీ న‌ట్టింటికొచ్చా.. నీకు మూతి మీద మొలిచిన మీస‌మే అయితే .. నువ్వు మగాడివే అయితే.. రా చూస్కుందాం..! అన్న‌ట్టుగా … ఇక్క‌డ రివ‌ర్సులో రేవంత్‌కు…