(దండుగుల శ్రీనివాస్)
జీతాలు పడ్డయంట కదా….
ఏడ ఇంక… ముప్పైవేల లోపు జీతాలున్నోళ్లకే ఏసిండ్రు..!
అదేందీ అందరికీ పడలే…!
ఏమో అంత అడక్కతిన్నట్టు చేస్తున్నరు…
విడతల వారీగా ఏస్తరంట… మధ్యలో గిట్లనే ఏసిర్రు.. ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టిర్రు…
ముందే చెప్పిండ్రట కదా.. ఇక నుంచి టైంకు పడయని…! మరి మీరు దానికి సెట్ కావాలె కదా..
చెప్పిండ్రు.. కానీ ఆరు ఏడు తారీఖులల్ల ఏసేదీ.. ఇప్పుడు పది పదకొండు తేదీల దాకా గుంజుకొస్తుండ్రు…
మరి దానితగ్గట్టుగానే మీరు కూడా సెట్ చేసుకుంటే సరిపాయా..
ఏం సరిపెట్టుకుంటం… ఈఎంఐలు అప్పటిదాకా ఆగుతయా..? ఏడికెళ్లి తెచ్చి కట్టాలె..
ఇంత ఘోరముంటదానే.. ఏడనైనా… ఐదేండ్ల నుంచి ఒక్క ఇంక్రిమెంట్ లేదు.. ఇప్పుడు గీ జీతాలు కూడా లేవాయె..!
ఉద్యమంలో పనిచేసి, రాష్ట్రం కోసం, కేసీఆర్ కోసం ఇంతగానం పనిచేసిన మాకే దిక్కులేదు… ఇగ వీళ్లు జనాలకేం జేస్తరు.. అర్థమైపోతలేదా..?
ఇప్పటి దాకా అందరి కండ్లు సెల్ ఫోన్లలల్లనే .. జీతాలు ఇయ్యాళైనా పడ్తాయా అని. దీనెమ్మ రేపు ఎల్లుండి హాలిడే.. ఇగ సోమవారం దాకా ఆగలే. ఆ రోజు ఎదురుచూపులు మళ్లా..