(దండుగుల శ్రీ‌నివాస్‌)

గుండాల క్రిష్ణ‌. న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జి. ఆ ప‌త్రిక‌కు షాడో ఎడిట‌ర్‌. ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తికి రైట్ హ్యాండ్‌. ఆ ప‌త్రిక‌లో ఇత‌డు చెప్పిందే వేదం. క్రిష్ణ ఎట్ల చెబితే అట్ల తోకాడిస్తాడు ఎడిట‌ర్‌. హైడ్రా ఏర్పాటు త‌రువాత ఆక్ర‌మ‌ణ‌ల ఇక్క‌డ అక్క‌డ‌… అంటూ.. మావోళ్లంతా స‌త్తెపూస‌లు.. మీ వాళ్లే ఆక్ర‌మ‌ణ‌దారుల‌ని కుప్ప‌లు తెప్ప‌లుగా, పేజీల‌కు పేజీల‌కు వార్త‌లు కుమ్మేశారు వీరిద్ద‌రు.

గురివింద గింజ లాగా ఈ క్రిష్ణ కోట్ల‌కు కోట్లు పెట్టి క‌ట్టుకున్న ఇల్లే క‌బ్జాస్థ‌లంలో ఉంది. మీర్‌పేట్‌లో పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేసి ఇల్లు క‌ట్టుకున్నాడు గుండాల క్రిష్ణ‌. ఆ కాల‌నీ వాసులు ఎప్ప‌ట్నుంచో దీనిపై ఆగ్ర‌హంగా ఉన్నారు. ప‌లుసార్లు అధికారుల‌కు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. మొత్తానికి ఈ విష‌యం హైడ్రాకు చేరింది. వారు రీసెంట్‌గా క్రిష్ణ‌కు నోటీసులిచ్చారు. కొన్ని రోజుల గ‌డువిచ్చి కూల్చేందుకు సిద్ద‌మ‌య్యారు. దీనిపై ఇప్పుడు న‌మ‌స్తే తెలంగాణ తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. కొంత మందిని తీసుకుని హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌లిశారు ఎడిట‌ర్, క్రిష్ణ అండ్ టీం. కానీ క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ విన‌లేదు. ఇక స్పాట్ పెట్ట‌డ‌మే త‌రువాయిగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed