వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఇవాల్టి దినాన్ని యాది చేసుకున్న‌డు సీఎం రేవంత్‌రె్డి. స‌రిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మార్పు కోసం ఓటేసిన రైత‌న్నఅనుకున్న‌ది సాధించాడు. ఆ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా రైత‌న్న చ‌రిత్ర‌ను ప్ర‌జా పాల‌న స‌ర్కార్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింద‌ని చెప్పుకొచ్చాడు. ఏడాదిలో రైతుల కోసం ఎంత ఖ‌ర్చు చేసిందీ వివ‌రించాడు. రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామ‌న్నాడు. రైతులు మాపై న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని, అదే ఇప్పుడు క‌ళ్ల‌ముందు సాక్ష్కాత్క‌రిస్తున్న‌ద‌ని వివ‌రించిన ఆయ‌న నేడు పాల‌మూరులో రైతు పండుగ ముగింపుకు వెళ్తున్నాన‌ని ఎక్స్‌లో త‌న సంతోషాన్ని పంచుకున్నాడు.

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…
పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…
పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
ఆ ఓటు అభయహస్తమై…
రైతన్న చరిత్రను తిరగరాసింది.

ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…
రూ.7,625 కోట్ల రైతు భరోసా…
ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…
రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్…
రూ.1433 కోట్ల రైతుబీమా…
రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం…
రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు…

ఒక్క ఏడాదిలో …
54 వేల కోట్ల రూపాయలతో…
రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం.
ఇది నెంబర్ కాదు…
రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం.

ఈ సంతోష సమయంలో…
అన్నదాతలతో కలిసి…
రైతు పండుగలో పాలు పంచుకోవడానికి…
ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed