నమస్తే తెలంగాణను ప్రతీ ఒక్కరు చదవాలి.. అని ఎమ్మెల్సీ కవిత మీటింగులలో మరీ ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పత్రిక సర్క్యూలేషన్ గురించి ఈ మధ్య సీఎం కేసీఆరే దృష్టి పెట్టారు. ఆదివారం జరిగిన సికింద్రాబాద్ బోనాల ఉత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కానీ ఆ ఫోటో… వార్త నమస్తే తెలంగాణలో ఎక్కడా కనిపించలేదు. పత్రికలోని అన్ని పేపర్లూ తిరగేశారు. ఏ మూలకన్నా వేసుంటారేమోనని. ఉహూ.. ఎక్కడా కనిపించలే. పోనీ హైదరాబాద్ ఎడిషన్‌కే పరిమితం చేశారేమోనని అందులోనూ వెతికారు. ఏ మూలా చిన్న ఫోటో కూడా కానరాలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ వార్త గుప్పుమన్నది. నమస్తే తెలంగాణలో మన అక్క ఫోటో రాలేదా… ఎందుకు..? ఇంత నిర్లక్ష్యమా..? దీనికి ఎవరూ బాధ్యలు..? అంటూ మండిపడుతున్నారు జాగృతి, పార్టీ శ్రేణులు. మరోపక్క హైదరాబాద్ జర్నలిస్టు సర్కిళ్లలో కూడా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.