(దండుగుల శ్రీనివాస్)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు సోషల్ మీడియాలో వీర విహారం చేస్తున్నది. కృత్రిమ మేథ.. చాలా సందర్భాల్లో పిచ్చోడిచేతిలో రాయిలా మారుతున్నది. ఏది నిజమో…? ఏది అబద్దమో కూడా తెలియడం లేదు. చాలా మంది మేథావులు కూడా ఏఐ క్రియేషన్ వీడియో, ఫోటోలను నిజమే నమ్ముతున్నారు. నమ్మడమే కాదు వాటికి తమ స్పందన కూడా తెలియజేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టి మరీ కామెంట్లు పెడుతున్నారు. ఇది నిజమైంది కాదని ఓ పది మంది చెబితే తప్ప.. అవునా ఇది… నిజ్జమా..! అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎప్పుడు వర్షాలు పడినా ఓ వీడియో (ఏఐతో క్రియేట్ చేసింది) వైరల్ అవుతుంది.
చుట్టూ నిండా నీరు.. మధ్యలో పట్టాల మీద ఓ రైలు నిండుగర్భిణీల ప్రయాణికులను నింపుకునే రయ్యున ఆ వర్షపు నీటిలో పోతుండే ఓ ట్రైన్ వీడియో. ఇది చాలా మంది నిజమని భ్రమించారు. వీటిని సరదాగా షేర్ చేసుకుని మరీ వైరల్ చేస్తున్నారు నిజమని భ్రమించి. అయితే ఈ రెండ్రోజుల్లో కురిసిన అది భారీ వర్షాలకు మాత్రం ఓ ఫోటో కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అది ఈ పైనున్న ఫోటోనే. వరదలు రావడంతో ఆ ఇళ్లంతా బురదతో నిండిపోయి .. వరద నీరు వెళ్లిపోయినా.. బురద మిగిలిపోయి.. పడుకోవడానికి ఆ ఇళ్లు..ఆ బురద నిండిన గదే తప్ప వేరే గతిలేని సమయానా ఇళ్ల నిండుగర్బిణీ చంటిపాపతో, తన పెనిమిటితో అలిసి సేదతీరుతున్నది.
ఇది చాలా మంది నిజమనే అనుకున్నారు. కానీ కన్నీళ్లు తెప్పించింది చాలా మందికి ఈ పిక్చర్. అది క్రియేటివిటీయే అయినా.. కన్నీళ్లు తెప్పించాయి.. నిజ్జంగా కొన్ని చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి కూడా.. !అని తమ అనుభవాలను, బాధను, స్పందనను, సానుభూతిని, ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు ఈ ఫోటోపై. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ ఏఐ ఫోటో.

Dandugula Srinivas
Senior Journalist
8096677451
