టీఆరెస్ అభిమానులు కొన్ని విష‌యాల్లో స్పందించ‌క‌పోతే మంచిది. ప్ర‌తీదానికీ ఓవ‌ర్ గా స్పందించి ఉన్న ఇజ్జత్ తీసుకోకుండా ఉంటే మ‌రీ మంచిది. బీజేపీ రెచ్చ‌గొట్టే ప‌ద్ద‌తికి ప‌డిపోతే.. వారి ఉచ్చులో గిల‌గిలా కొట్టుకునేది మీరే. మ‌రి ఆ విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించాలి క‌దా. ఎవ‌రు గొప్ప .. అని మీకు మీరే స‌ర్టిఫికేట్ ఇచ్చేసుకోవ‌డానికి నానా తంటాలు ప‌డి… అప‌సోపాలు ప‌డి ఆఖ‌రుకు న‌లుగురిలో న‌వ్వుల‌పాలు కావ‌డం త‌ప్ప మ‌రేముంటుంది. నేను చెప్పేది మీకు ఏమి స‌మ‌జ్ కావ‌డం లేదా..? స‌రే, అస‌లు విష‌యానికొద్దాం…

మొన్నామ‌ధ్య కేటీఆర్‌, ఈట‌ల రాజేంద‌ర్ ఏదో ఫంక్ష‌న్‌కు పోయిన‌ట్టున్నారు. ముందుగా ఈట‌ల వెళ్లిన‌ట్టున్నాడు. ఈట‌ల రాగానే చాలా మంది సెల్ఫీల‌కు ఎగ‌బ‌డ్డారు. ఆయ‌న్ను క‌ద‌ల‌కుండా చేసి సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకున్నారు. అప్పుడే మ‌న రామ‌న్న ఎంట‌ర‌య్యాడు. ఈట‌ల గుంపు ప‌క్క‌నుంచే త‌ను వెళ్లిపోయాడు సైలెంట్‌గా. ఇదంతా ఎవ‌రో వీడియో తీశారు. చూశారా.. బండ్లు ఓడ‌లు.. ఓడ‌లు బండ్ల‌యిపోయాయి… మొన్న‌టి దాకా రామ‌న్న‌తో సెల్ఫీల‌కు ఎగ‌బ‌డేవారు. ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌తో సెల్ఫీలు దిగుతూ.. రామ‌న్న‌ను కనీసం కేర్ కూడా చేయ‌డం లేదు.. అనే విధంగా కామెంట్లు, పోస్టులు పెట్టారు. దీనికి మ‌న టీఆరెసోల్ల‌కు మండింది కావొచ్చు. మా రామ‌న్న ఏమ‌న్నా త‌క్కువ‌నా..? అని ఇప్ప‌టిదాకా ఆయ‌న దిగిన సెల్ఫీలు.. పెద్ద‌ల‌తో .. పెద్ద పెద్ద‌ల‌తోటి దిగిన‌వ‌న్నీ క‌ల‌పి సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. చాలా ఇంకా కావాల్నా అని ఎదురు ప్ర‌శ్నించారు.

ఇలా మీరు పెడితే త‌ప్ప కేటీఆర్ స్టేట‌స్ గురించి జ‌నాల‌కు తెలియ‌దా..? ఈట‌ల రాజేంద‌ర్ కు ఉండే ఫాలోయింగ్ అత‌నికుంది.. కేటీఆర్‌కు ఉండేది కేటీఆర్ కూ ఉంది. ఎవ‌రు కాద‌న్నా… కేటీఆర్ కాబోయే సీఎం. యువ‌రాజు. మ‌రి ఆయ‌నను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బీజేపీ వాళ్లు అన‌గానే మీరు రెచ్చిపోయి ఇలా ఫోటోలు ప్ర‌ద‌ర్శించి చుల‌క‌న కావ‌డమెందుకు బ్ర‌ద‌ర్. కేటీఆర్‌ను మ‌రీ చిన్న‌గా చేసి చూప‌డ‌మెందుకు నాయ‌న‌..? మీరు మీ అభిమానం.. మీలాంటి వాళ్ల వ‌ల్లే ఉన్న ఇజ్జ‌త్ కూడా పోతుంది రా బై.

You missed