రైతు బాధ‌ల్లో ఉన్న‌డ‌నే క‌దా ధ‌ర్నా చేసింది. ఆ బాధ‌లు, క‌న్నీళ్లు తుడ‌వాల‌నే క‌దా కంక‌ణం క‌ట్టుకున్న‌ది. యాసంగిలో రైతుకు అండ‌గా ఉందామ‌నే క‌దా.. వ‌ద్ద‌న్న ధ‌ర్నాచౌక్‌లో అడుగుపెట్టింది. కేంద్రాన్ని క‌డిగిపారేసి.. రైతులంతే ఎవ‌రి ప్రేముందో అని తేల్చిచెప్పేందుకే క‌దా సీఎం కూడా ఈ ధ‌ర్నాకు వ‌చ్చింది. ఇంత సీరియ‌స్ ఇష్యూలో మీ న‌వ్వులేందే..? సంత‌న్న‌.స‌రే, ధ‌ర్నా అంతా అయినంక ఫేస్‌బుక్కులో మీ ఫోటోలు పెట్టుకునేందుకు దిగిర్ర‌నుకుందాం… అప్పుడు కూడా ఇది న‌వ్వే సంద‌ర్బం కాదుక‌ద‌నే. సంత‌న్న‌.

నీది న‌వ్వు ముఖ‌మే. ఎప్పుడూ న‌వ్వుతుంట‌వు. సరే, మరి మ‌న ఎమ్మెల్యేలు కూడా నువ్వు న‌వ్వుతున్న‌వ‌ని న‌వ్వ‌వ‌ట్టిరి. ఇట్ల అంతా క‌లిసి న‌వ్వుతూ ఫోటోల‌కు ఫోజిలిస్తే.. ఇది రైతు ధ‌ర్నానా.. సంతోషంగా మీరంతా ఓ చోట గుమిగూడి సంబ‌రాలు చేసుకున్న సంద‌ర్భ‌మా…? కేసీఆర్ ఏదో చేద్దామ‌నుకుంటాడు. ఇగో మీ అసొంటోళ్లంతా క‌లిసి ఇట్ల ఆగం చేస్త‌రు. ఎప్పుడు ఎలా ఉండాలే. ఏం చేయాలో కూడా మీకు తెల్వ‌దానే సంత‌న్నా..? ఇది మ‌రీ అన్నాలం. అన్ని పార్టీలు రైతుల కోసం రోడ్డెక్కిన‌యి. స‌ర్కారు కూడా రోడ్డెక్కింది.

సీఎం ధ‌ర్నా చౌక్‌కు దిగొచ్చిండంటే.. ఇగ రైతుకు ఢోకా లేదు. అంతా ధీమానే అనుకున్నం. మీరు గిట్ల అప్పుడే అంతా అయిపోయింది. రైత‌న్న‌కు మేలు జ‌రిగింది. ఇగ మేం జేసిన ధ‌ర్నా స‌క్సెస‌య్యింది. ఢిల్లీ మెడ‌లు వంచినం. రైతు బాధ‌లు తీరిన‌య్‌.. అన్న లెవ‌ల్లో ఫోజులిచ్చి అంతా ఆగం జేసిర్రు పో……

You missed