దెబ్బ మీద దెబ్బ.. కష్టాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ! కాళేశ్వరం తప్పుడు ప్రాజెక్టుగా నివేదిక.. దోషులుగా కేసీఆర్, హరీశ్! కేటీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్, ఈ -కార్ రేస్ కేసు! పార్టీకి గుడ్‌బై చెప్పే పనిలో బిజీగా ఉన్న మాజీలు! బీజేపీతో దోస్తానా .. బయటకు రావడంతో ముందే పెట్టేబేడా సదరుకుంటున్న వైనం..!
(దండుగుల శ్రీనివాస్) ఒకడుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కి పడుతున్నాయి బీఆరెస్ పార్టీవి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇలా తేరుకుని ఊపందుకుంటుందన్న ప్రచారం వచ్చీరాగానే నిండా కష్టాల్లో కూరుకుపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఇప్పుడు బోనులో నిలబడి ఉన్నారు. వీరిని శిక్షించడం తప్పదు.…