(దండుగుల శ్రీనివాస్)
హరీశ్ పొద్దున్నే అసెంబ్లీకి తాగొచ్చాడా..? మరెందుకు అంతలా సోయి లేకుండా మాట్లాడుతున్నారు. అధికార పార్టీని ఔట్ చేయాలనే ఫ్రస్ట్రేషన్‌లో కేటీఆర్‌ను మించి తాను ముందుండాలనే తొందరపాటో… మామ దగ్గర మెప్పు పొందాలనే ఆత్రపు పైత్యమో తెలియదు కానీ.. అచ్చంగా తప్పతాగిన తాగుబోతులాగే మాట్లాడాడు. నిండు సభలో సహచర సభ్యులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను తాగి వస్తున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని అనడం ఎవరూ హర్షించరు.
హరీశ్ మేథావి మాటలను ఎవరూ శెభాష్ అనరు. చివరకు ఆ పార్టీ సభ్యులు, నేతలు, కార్యకర్తలతో సహ. అవును…! విమర్శించడానికీ కొన్ని హద్దులుంటాయి. వాళ్లంతా ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు. ఎమ్మెల్యేలు. ప్రజాస్వామ్యం గురించి, నిబంధననలు, రూల్స్ గురించి పేరాలు, కామాలు, కాలమ్‌లతో సహా వల్లెవేసి తనో పెద్ద మేధావి అనుపించుకునే ప్రయత్నం చేసే హరీశ్ రావు నిజస్వరూపం ఇది. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తాగొస్తున్నారన్నాడు. వారిని తాగుబోతులను చేశాడు. మరి ఆ సభ్యుల మెజారిటీ తోనే కదా సర్కార్ ఏర్పడింది.
అంటే సర్కార్ కూడా తాగుబోతు సర్కారేనా..? ఓట్లేసిన ఓటర్లు తాగిన మైకంలో వీరిని గెలిపించి ఉంటారు.. బహుశా..! అంతే కదా హరీశ్. మీ మామ కేసీఆర్ ఏదో సందర్భంలో ఎవరినో ఘాట్టిగా కసురుకున్నాడు. అర్సుకున్నాడు. మీడియా సమావేశం సాక్షిగా. ఏదంటే… నేను తాగుతుంటే వాడు చూశాడా..? వాడెమన్నా పెగ్గు కలిపాడా…? ఏంటీ చిల్లర మాటలు..? ఇంతలా దిగజారి మాట్లాడాలా…? ఇంకా ఏవేవో సుద్దపూస మాటలు మాట్లాడాడు. నువ్వూ ఓ పెద్ద సుద్దపూసవేనని తేలింది.
మామ అల్లుండ్లు ఒకే లిక్కర్ చుక్కలన్నమాట. మీ అసలు రంగు ఇదేనన్నమాట. జనాలకు కొంచెం… సానుభూతి వచ్చే లోపే మీ అహంకారాన్ని ఇలా ప్రదర్శించి .. మీ బలుపు చేష్టలను ఇలా బహిర్గతం చేసి.. మీ పైత్యపు మాటలను ఇలా వికారపు వాంతులతో బయటపెట్టి… జనం చేత చీత్కారాలు పొంది.. ఇంక మీరు మారర్రోయ్…! అనిపించుకుంటున్నారు బావబామ్మర్దులు, మామ అల్లుండ్లు.. తండ్రీ కొడుకులు… బావామరుదళ్లు.. అన్నాచెళ్లెలు…..!!