” నాలుగేళ్లైంది అన్నా.. . ఇంత వరకు ఈ మార్కెట్ కమిటీకి చైర్మన్ దిక్కు లేడు…”
“ఎందుకు..?”
” ఏమో.. నీకిస్తాం.. ఎహె నీకే ఇస్తాం… అని అందరికీ మోచేతికి బెల్లం పెట్టి .. ఇగో ఇట్ల చావ కుండా, బతకకుండా చేస్తున్నరు…”
“ఎంత మందికి చెప్పిండ్రట్ల….?”
“నాలుగు నియోజకవర్గాలు.. అందరు ఎమ్మెల్యేలు నాక్కావలంటే నాకు అని ఎవరి పేర్లు ఆళ్లు చెప్పుకుంటున్నరు… పైన మాత్రం సప్పుడులేదు ….”
” బోధన్ ఎమ్మెల్యే అంటడు…. నా మనిషికే కావాలని. అర్బన్ ఎమ్మెల్యే మావోడు చానా కాలం నుంచి ఏం పదవి లేక పడీత్గున్నడు మావోడికే కావలంటడు…. రూరల్ ఎమ్మెల్యే నాకొద్దా..? అని అడ్డుపడ్తడు. ఆర్మూర్ ఆయన నేనేం తక్కువ తిన్ననా… అక్కకు చెప్తా… అన్నకు చెప్తా… నాకే కావాలంటడు…”
” ఎవలకూ రాదు…ఎంతకీ పంచాది తెగదు. పాపం ఈళ్లు మాత్రం ఇట్ల నాలుగేళ్ల సంది నీళ్లు లేని బాయిలో పడేసినట్టు… గుక్కెడు నీళ్లు దొరకకపోతయా..? అన్నట్టు… ఆశగా ఈ పదవి కోసం ఎదురుసూస్తనే ఉన్నరు…”
“ఒక్కటే అర్థమైందన్నా…”
” ఈ పంచాది ఇప్పట్ల తెగది. ఒక్కళ్లకిస్తే పది మంది నారాజ్ అయితరు. అందుకే ఎవలకూ ఇయ్యరు. అందరికీ నీకస్తమంటే నీకిస్తమని మాత్రం ఇంకా చెప్తనే ఉంటరు.. ఊరిస్తనే ఉంటరు….చావకుండా, బతకకుండా..”
” పైసలు పెట్టుకుని ఎవనికాడు పైరవీ చేస్తుండు… జనాలను తోల్కపోయి బలం సూపిచ్చుకుంటుండ్రు… సరే నీకే ఇస్తం పో అని ఆళ్లు నెత్తిమీద చెయ్యివెట్టి చెప్పి మరీ పంపుతుర్రు… ఇక ఈడు కలల లోకంలోనే ఉంటుండు…. అది రాదు పోదు…”
” అప్పుడు కవిత టక్కున ఓ నిర్ణయం తీసుకుంటే ఆ పని అయిపోయేది. ఇపుడామె ఈ విషయంలో పట్టించుకోవడమే లేదు. ఇగ ఎమ్మెల్యేలు నాకంటే నాకని పీకులాడుకునుడే సరిపోయింది….”
” అన్నీ అయిపోయినయి… ఇంత ప్రయార్టీ ఉన్న నిజామాబాద్ది మాత్రం ఎటూ పంచాది తెగదు. ముడిపడదు.”
“ఆలోపు ఎలక్షన్లే వచ్చేటట్టున్నయ్…… కానీ దీనిమీద మాత్రం క్లారిటీ రాదు…. ”
“తెల్వక అడుగుత…..
దీంట్ల బాగా ఆమ్దానీ ఉంటదానే….. దీని కోసం ఇంత మంది కొట్లాడ్తుర్రు… ఇంతకాలం పెండింగ్ల పెట్టిర్రు..”
