వాస్త‌వం ప్ర‌తినిధి – మంచిర్యాల‌:

కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఇద్ద‌రికీ ద‌గ్గ‌రే ఆ యువ నాయ‌కుడు. చిన్న వ‌య‌స్సులోనే మంచి అవ‌కాశాలు కూడా ఇచ్చారా నేత‌కు పార్టీ పెద్ద‌లు. ప‌దేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఇక త‌మ‌కు తిరుగే లేద‌నుకున్నారు చాల మంది గులాబీ నేత‌లు. అవినీతి, దౌర్జ‌న్యాలు అంతా ఇంతాకావు. ఎప్పుడూ మేమే అధికారంలో ఉంటామ‌నే అహంకారం కూడా దీనికి తోడ‌య్యింది. పెద్ద‌ల ఆశీస్సులు ఉన్నాయ‌నే బ‌లుపు కూడా తోడు రాగా ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు చెప్పొచ్చేది ఈ మంచిర్యాల జిల్లాకు చెందిన యువ నేత గురించే. మొన్న జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ రౌడీ వేశాలు వేసి.. నానా అల్ల‌రి చేసి దాడుల‌కు తెగ‌బ‌డ్డ ఈ యువ‌నేత‌పై కేసులు న‌మోద‌య్యాయి. ప‌లువురికి గాయాలు కావ‌డం,ఈ ర‌చ్చంతా చేయ‌డం ద్వారా త‌నో హీరో కావాల‌నే తాప‌త్ర‌యం ఆ యువ‌నేత‌లో క‌నిపించింది.

కానీ దీన్ని ప‌సిగ‌ట్టిన స్థానిక నేత‌లు స‌ద‌రు ఈ యువ‌నేత పాత బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టారు. నాడు హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ ఈ యువ మాజీ ఎమ్మెల్యేను క‌మ‌లాపూర్ మండ‌ల ఇంచార్జిగా నియ‌మించారు. అయితే అక్క‌డే దాదాపు మూడు నాలుగు నెల‌లు తిష్ట వేసిన ఈ యువ నేత అక్క‌డి బీఆరెస్ నేత భార్య‌తోనే అక్ర‌మ సంబంధం నెర‌పార‌నే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నారు. దీన్ని అప్ప‌ట్లో తీవ్ర ప్ర‌చారం చేశారు రాజ‌కీయంగా. యూట్యూబ్ వీడియోల ద్వారా తెగ వైర‌ల్ చేశారు. ఇప్పుడు ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఈ నేత రౌడీవేశాల‌తో మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాడు. దీంతో ఆ పాత వీడియోలు మ‌ళ్లీ తిప్పుతున్నారు మంచిర్యాల జిల్లాలో. ఈ విష‌యం తెలియ‌ని వారికి కూడా తెలిసిపోయేలా. అధికారంలో ఉన్న‌ప్పుడు అక్ర‌మ‌స‌బంధాల రొచ్చు.. ఇప్పుడు అధికారం పోయిన త‌రువాత ఫ్ర‌స్టేష‌న్‌లో దాడులు చేస్తూ రౌడీలా ప్ర‌వ‌ర్తించే ఇలాంటి నేత‌ల‌కు మ‌ళ్లీ గెలిచే అవ‌కాశ‌మే ఇవ్వొద్ద‌నే విధంగా ప్ర‌చారం చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశంగా మారింది.