నిఖత్ జరీన్‌కు బంగారు పతకం రావడం … ఆ వార్తను ఎలా ప్రజంట్ చేయాలో తెలియక నానా అవస్థలు పడి ఏదో ఒక లాగా తమకు జీర్ణమయ్యే రీతిలో ఓ వార్త అచ్చేసి వదిలేశాయి ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు. అవన్నీ మళ్లీ షరా మామూలుగా తమ పచ్చ పైత్యాన్నే చూపాయంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. తెలంగాణ బిడ్డ అని చెప్పడానికి వాటికి నోరు రాక నానాయతనాలు పడ్డాయి. ఈ పత్రికల నిజస్వరూపాలు ఇలా ఉన్నాయి చూశారా? అంటూ విరుచుకుపడ్డారు చాలా మంది. వీరు మారరని ఒకరు, అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే ఆంధ్ర వజ్రం, ఆంధ్ర బంగారం అని ఏవేవో రాసుకునే వారని కూడా తిట్టిపోశారు. ఇంకా ఇక్కడి ప్రజలపై ఇక్కడి ప్రాంతంపై పచ్చ పత్రికలకు వివక్ష ఎలా ఉందో ఈ వార్త కథనం అచ్చేసిన తీరే నిదర్శనమే విధంగా సోషల్ మీడయాలో ఈ ప్రధాన పత్రికలను తీరును ఎండగట్టారు నెటిజన్లు.