పాపం.. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల వేద‌న మామూలుగా లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి పార్టీకి, ప్ర‌భుత్వానికి స‌పోర్టుగా, బీజేపీ మీద ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్లు ఇచ్చేందుకు ముప్పుతిప్ప‌లు ప‌డి ఏదో చేస్త‌న్నారు. పోస్టులు పెడుతున్నారు. ఎక్క‌డా ప‌రువు పోకుండా కాపాడుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ వీళ్ల‌ను ప‌ట్టించుకునే వారే లేర‌ట‌. వీరి మ‌నోవేద‌న‌ను ఫేస్‌బుక్ వేదిక‌గా కొన్ని వంద‌ల సార్లు మొర‌పెట్టుకున్నారు. అయినా స్పంద‌న‌లేదు. మొన్న హుజ‌రాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలో హ‌రీశ్‌రావు త‌న తెలివిగా వారంద‌రితో ఓ మీటింగు పెట్టి వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాడు. కానీ కొంద‌రికే ఆహ్వానం దొరికింది.. మ‌మ్మ‌ల్నెవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని అప్ప‌డూ ఓ లొల్లి.

ఆ త‌ర్వాత రామ‌న్నసోష‌ల్ మీడియా వారియ‌ర్ల‌కు నేనున్నాన‌నే భ‌రోసా ఇచ్చాడు. ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే ఇవ్వాల‌ని పిలుపిచ్చాడు ఆవేశంగా. కానీ ఆ ఆవేశం త‌ర్వాత క‌నిపంచ‌లేదు. వీరి వైపు దృష్టి కూడా పెట్ట‌లేదు. సోష‌ల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న క్రిషాంక్ పార్టీ శ్రేయ‌స్సుకు చేసిందేమీ లేదు కానీ, త‌న సంక్షేమం తాను చూసుకుని ఓ కార్పొరేష‌న్ ప‌ద‌వి ద‌క్కించుకుని గ‌ట్టెక్కాడు. ఇదిగో, మ‌ళ్లీ టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల ఆవేద‌న ఇలా పెల్లుబుకింది. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకున్న‌వారెవ్వ‌రూ.. ? దీనికి అతీగ‌తీ లేదు. దిక్కూ దివానం లేద .. అనే విధంగా కామెంట్లు పెడుతున్నారు.

You missed