ఎమ్మెల్సీ క‌విత రాష్ట్రానికి సీఎం కావాల‌నే ఆకాంక్ష పెరుగుతున్న‌ది. మొన్న‌టి వ‌ర‌కు ఆమె ఎమ్మెల్సీగా అవుతుందా..? రాజ్య‌స‌భ‌కు పోతుందా..? అని టెన్ష‌న్‌గా చూసిన జ‌నాలు, నాయ‌కులే ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వందుకుంటున్నారు. ఆమె ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా గెలిచిన త‌ర్వాత శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. ఇది కామ‌నే. ఆమె ఎక్క‌డుంటే అక్క‌డం జ‌నం జార‌త‌గా ఉంటుంది. తోపులాట కూడా ఉంటుంది. కానీ ఈసారి అలా కాదు. అంత‌కు మించి.

ఆమె ఏదో కాబోతుంది. ఏమి కాబోతుంది. మంత్రైతే ప‌క్కా. కాదు కాదు.. ఇంకేదో. మ‌రింకేది..? ఇంకా అంత‌కు మించి. అంత‌కు మించి ఏముంటుంద‌బ్బా..? ఇలా నెత్తి నోరు కొట్టుకుంటున్న‌వేళ .. కొత్త నినాద‌మొక‌టి పుట్టుకొచ్చింది. అదే ఆమె సీఎం కాబోతుంద‌ని. అదేంటీ.. న‌వ్వుతున్నారా? స‌రే, న‌వ్వుకోండి. నాకేంటి గానీ. ఈ ప్ర‌చార‌మైతే జ‌ర‌గుతున్న‌ది. ఆమె ద‌గ్గ‌ర‌కు శుభాకాంక్ష‌లు చెప్పేందుకు బారులు తీరిన నేత‌లు చాలా మంది ఆమెతో నేరుగా అన్నార‌ట‌. మీరే సీఎం మేడం. మీరు సీఎం కావాల్సినోళ్లే.. అని. మాకు తెలుసు పైన ఏం జ‌రుగుతుందో..? మేం ఊహించ‌గ‌లం అనే రేంజ్‌లో మ‌రికొంద‌రు మాట్లాడుతున్నార‌ట‌.

ఆమె హావ‌భావాలు ప‌సిగ‌డ్దామ‌ని ఎంత ప్ర‌య‌త్నించినా.. పాపం వారికి ఆ భావాలు అంతుచిక్క‌లేదట‌. అన్నింటికీ ఒక‌టే స‌మాధానం. చిరున‌వ్వు. మ‌రి దాన్ని ఖండించ‌నైనా ఖండించ‌లేద‌ట‌. అంటే అర్థ‌మేమిటి..? అందులో వాస్త‌వ‌మున్నట్టే క‌దా. ఇది నేన‌డం లేదు. వాళ్లే బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ ముచ్చ‌టించుకున్నార‌ట‌. ఏమ‌ని…? క‌విత‌మ్మే కేటీఆర్ క‌న్నా న‌యంరా బై. ఆమె అన్నింట్లోనూ సీఎంగా బెటర్‌. సీఎం కావాల్సిందే. కావాలంటే చూడు అవుతుంది త‌ప్ప‌కుండా. మనం అలా అంటే కూడా న‌వ్వుతుందే త‌ప్ప ఖండించ‌డం లేదు.. అని కూడా త‌మ వాద‌న‌ను త‌మే స‌మ‌ర్థించుకుని, త‌మ జ‌బ్బ‌లు తామే చ‌రుచుకుని పోతున్నార‌ట.

ఇప్పుడు ఈ ముచ్చ‌ట కొత్త‌గా చ‌క్క‌ర్లు కొడుతుంది. కేటీఆర్‌ను కాద‌ని, క‌విత‌ను సీఎం చేస్తారా? అని ఎవ‌రైనా అడిగితే.. ఏం చేయ‌కూడ‌దా..? అదంత అసాధ్య‌మా..? అని కూడా కొంద‌రు వాద‌ల‌కు దిగుతున్నార‌ట‌. రామోజీరావు లాంటి వారే ఇలా క‌విత‌మ్మ‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నాడంటే అర్థ‌మేమిటి..? ఏదో జ‌రుగుతుంద‌నే క‌దా..? అదీ సంగ‌తి. ముందు ముందు మ‌నం మ‌స్తు చూడాల్సి ఉంది భ‌య్‌.. అప్పుడే అలా గ‌భ‌రా గ‌భ‌రా అయిపోకు. కొంచెం ఓపిక పట్టు..

You missed