ప‌జ్జ‌న్న నీ టైం ఇప్పుడు బాగ‌లేదు. ఒక‌ప్పుడు నువ్వు కేసీఆర్‌కు కుడిభుజానివే. మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చి మంచి మ‌ర్యాద చేసిండు. కానీ ఆ త‌ర్వాత నువ్వు దూరమైతూ వ‌చ్చిన‌వు. నీకు అటు కేసీఆర్ దగ్గ‌ర మంచి మార్క‌లు లేవు.. ఇటు కేటీఆర్ నిన్ను ద‌గ్గ‌రికి రానీయ‌డు. మొన్నామ‌ధ్య కేటీఆర్ సీఎం కాబోతుండ‌ని స‌భావేదిక మీదే ప్ర‌క‌టించి .. ప‌నిలో ప‌ని కంగ్రాట్స్ కూడా చెప్పేశావు. ధైర్యం చేశారు.

రాజ‌కీయాల్లో అదే కావాలి. అయితే ప‌ద‌వులున్నా వ‌స్తాయి.. లేదా అవ‌మానాల‌న్నా కాచుక్కూర్చుకుంటాయి. ప్ర‌స్తుతం నీ సీజన్ అవ‌మానాల సీజ‌న్‌. ఇప్ప‌టికే టైం బాగా లేదంటే.. నిన్ని బిడ్డ పెండ్లికి పోయి పోయి ఈట‌ల రాజేంద‌ర్‌ను పిలుస్తావా? ఉత్త‌గ‌నే మ‌ర్యాద‌కు పిలిచిన‌వా..? మ‌న‌స్పూర్తిగా పిలిచిన‌వా..? నువ్వు పుసుక్కున పిలిచిన‌వో లేదో.. అయిన పోలోమంటూ రావ‌ట‌మేనా..?

స‌రే, వ‌చ్చిండే అనుకో.. అలా దూర దూరంగా ఉండి ఏదో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఇంత బువ్వ పెట్టి సాగనంపితే స‌రిపోయేది. ఇలా ఒక‌రినొక‌రు అలుముకుని, క‌డుపారా న‌వ్వుకుని, పాత జ్ఞాప‌కాలు నెమ‌రేసుకునే టైపు ముఖాలు పెట్టుకుని, ఆనంద బాష్పాలు రాల్చుకుని, చిన్న‌పిల్ల‌ల్లా క‌లివిడిగా క‌లిసిపోయి… అక్క‌డున్న అంద‌రికీ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారి.. ఏందీ.. ఇవ‌న్నీ ప‌జ్జ‌న్న‌…! నీకేమన్నా అర్థ‌మైతుందా? పోనీలే ఎంతైనా ఉద్య‌మంలో ఆర్థికంగా స‌పోర్టుగా ఉన్నాడ‌ని నీ మీద కోపంగా ఉన్నా.. నీ బిడ్డ పెండ్లికి వ‌చ్చిండు కేసీఆర్.

ఇప్పుడేమో నువ్వు అదే పెండ్లిల‌ ఈట‌ల రాజేంద‌ర్‌తో రాసుకుపూసుకు తిర‌గ‌వ‌డ్తివి.ఇగ నీ ప‌నైపోయింది పో..! డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి కూడా పీకేస్తాడు. వ‌చ్చేసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్య‌డు. ప్ర‌భుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన రాజ‌ద్రోహి ఈట‌ల‌తో ఇలాగేనా నువ్వు ఉండేది.. ? నీకు లోక‌రీతి ఇంకా తెల్వ‌లే. అందుకే మంత్రి ప‌ద‌వి రాలే. ఇప్పుడు ఇక ఏ ప‌ద‌వులు రావు పో …. నీ ఖర్మ‌..!!

 

 

 

You missed