నమస్తే తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాలు తీసేసే కొత్త ట్రెండ్ మొదలయ్యింది. మొన్నటి వరకు సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బ్యూరో ఇన్చార్జిలను అందరినీ బదిలీల పేరుతో బలి చేసిన మేనేజ్మెంట్.. ఇప్పుడు ఏడీవీటీ టీంపై పడింది. ఐదారేండ్లుగా పేరుకుపోయి.. మొండి బకాయిలుగా ఉన్న వాటిని వసూలు చేయాలని మెడపై కత్తి వేలాడదీసింది మేనేజ్మెంట్. వసూలు చేసే వరకు జీతాల్లో కోతలు తప్పవని హెచ్చరించింది. హెచ్చరించడమే కాదు.. ఈ నెలలో వచ్చిన జీతాల్లో కోతలు కూడా పెట్టింది.
జీతం ఎందుకు తక్కువొచ్చిందని నోరెళ్ల బెట్టిన ఏడీవీటీ టీం.. మేనేజ్మెంట్ను అడిగితే చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో అవాక్కయిన ఉద్యోగులు.. కావాలంటే వారి అడ్రస్‌లు, సెల్ నెంబర్లు ఇస్తాం.. మీరే వాటిని డీల్ చేయండి.. అసలు విషయం తెలుస్తుంది..అని మొరపెట్టుకున్నా వినలేదు. మాకదంతా తెలియదు. మీరు వసూలు చేయాలి. లేదంటే జీతాల్లో కోతలు పడుతూనే ఉంటాయి అని చెప్పేశారు. ఉంటే ఉండండి లేదంటే ఉద్యోగాలు మానేయండి అనే రేంజ్లో.
దీంతో కొందరు ఇంత కష్టపడి చేసింది మేనేజ్మెంట్ కోసమే కదా.. దాన్ని గుర్తించకపోగా.. మొండి బకాయిలు పేరుతో ఇలా జీతాలు తగ్గించడమేందని ఆవేదనతో రాజీనామాలు చేసేందుకు రెడీ అయ్యారంట. కొందరు ఇప్పటికే రిజైన్ చేసి వేరే పనులు చూసుకుంటున్నారు. వచ్చే నెలలో కూడా కోతలుంటాయనే వార్నింగ్ నేపథ్యంలో.. ఏం చేయాలో పాలుపోక కొందరు ఉద్యోగం వదలాలా? వద్దా..? అని ఊగిసలాటలో ఉన్నారు. ఇంకొందరు ఉరుకులాడి యాడ్స్ చేస్తే మేనేజ్మెంట్ ఇచ్చిన గౌరవం చూసి .. ఇక చాలు మీ మర్యాద.. అని ఏదో అలా నామ్‌కే వాస్తే యాడ్స్ తెస్తూ ప్రాణల మీదకు, జీతాల మీదకు, జీవితాల మీదకు తెచ్చుకోవడం మానేశారట. దీంతో రెవెన్యూ తగ్గింది.
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న చందంగాఈ ప్రయోగం ఇలా బెడిసి కొట్టిందంట. అసలే సర్క్యూలేషన్ తగ్గి ఏం చేయాలో తెలియక వార్తల కంటెంట్ మార్చుదామని ఏదో ప్రయోగాలు చేసేందుకు తంటాలు పడుతున్న వేళ .. ఈ ప్రయోగం ఇలా బెడిసికొట్టింది. కొత్త ఎడిటర్ వచ్చిన నాటి నుంచి తీసుకుంటున్న ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో విసిగెత్తి, ఇది మన పత్రిక కాదు.. అని విరక్తి చెంది.. చాలా మంది స్వచ్చంధంగా కూడా వెళ్లిపోతున్నారట. డెస్క్‌లో ఇప్పటికే చాలా మంది రిజైన్ చేశారు. ఇతర పనులు చేసుకుంటున్నారు. కొత్త ఎడిటర్ వచ్చిన కొత్తలో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో అని భయం నీడలో బ్రతికిన ఉద్యోగులు.. ఇప్పడు నీ ఉద్యోగం వద్దు నువ్వు వద్దు…. పో పో అని రిజైన్ లెటర్ ముఖాన కొట్టి వెళ్లిపోతున్నారట. ఇదీ నమస్తే తెలంగాణలో నడుస్తున్న తెలంగాణ.
