అప్పటి వరకు ప్రజలంతా ఈటల రాజేందరన్న వైపే ఉన్నారు. కానీ చివరి రెండు రోజులు డబ్బులు పంచారు విపరీతంగా…
ఒక్కొక్కరికి ఆరువేలు.. ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి.
పది మంది ఉన్న ఇంటికి అరవై వేలొచ్చాయి. ఒక ఏడాది గాసం వారికి వెళ్లిపోయినట్టే. ఇందులో కొందరు టీఆరెస్‌కు వేస్తే.. ఇంకొందరు బీజేపీకి వేశారు.
అయినా ప్రజలెప్పుడూ గొప్పొళ్లే.. అన్ని పైసలు తీసుకుని కూడా ఈటలకు ఓటేశారు.
చివరి రెండు రోజులు ఎవరినడిగినా కారు.. కారు అన్నారు. అదేందీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది…అనని భయపడ్డాం. అప్పటి వరకు ఈటల రాజేందర్ వైపే ఉన్న జనం చివరి నిమిషంలో మెల్లగా టర్న్ అయ్యారు.
మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాం. మీతోని ఉండేది రాజేందరన్న.. మీకు ఏ కష్టం వచ్చినా చూసేదీ ఆయనే. ఆస్పత్రిలో చేరినా.. ఉద్యోగం కావాలన్నా.. పెండ్లికి సాయం కావాలన్నా.. ఫీజులకు ఉడుతాభక్తిగా సాయం చేయాలన్నా.. అన్నీ ఆయన చేస్తాడు. మీరు పిలిస్తే వస్తాడు.
కానీ వీళ్లంతా మీతో ఉంటారా? మీ కష్టాల్లో పాలు పంచుకుంటారా?
ఈ విషయాలన్నీ వాళ్లకు తెలుసు. కానీ మరోసారి వాళ్ల వద్దకు వెళ్లి చెప్పినం. ఆ ఆర్తి, ఆవేదన అర్థం చేసుకున్నారు.
అందుకే ఈటల వైపే నిలిచారు.
ఒకవేళ ఈటల రాజేందర్ ఓడిపోతే .. ఇక రాజకీయాల నుంచి తప్పుకుందామని డిసైడ్ అయ్యాను.
అవును.. ప్రజాస్వామ్యం బతికిలేదని తేలిపోయినంక ఎందుకీ రాజకీయాలు అనిపించింది.
కానీ హుజురాబాద్ ప్రజలు గొప్పోళ్లు. ప్రజాస్వామ్యాన్ని బతికించారు. ఈటలను గెలిపించారు.
కానీ, ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ఓ కొత్త పద్దతిని, సంస్కృతిని పరిచయం చేసింది.
ఇక ఏ ఎన్నిక జరిగినా ఖర్చు తడిచిమోపడవతుంది.
ఒక్కో ఓటుకు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇవ్వాల్సిందే. అలా చేస్తేనే గానీ గెలవరు అనే పరిస్థితి క్రియేట్ చేశారు.
బహుశా రేపు ఎన్నికల్లో టీఆరెస్ ఇదే పంథాను మళ్లీ అమలు చేస్తుంది కాబోలు. ఆ మేరకు ముందుస్తు ప్లానింగ్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు.