హుజూరాబాద్‌లో టీఆరెస్ ఓట‌మి అంచుల‌కు చేర‌డం అటు టీ న్యూస్‌కు, ఇటు న‌మ‌స్తే తెలంగాణ‌కు అస్స‌లు జీర్ణం కావ‌డం లేదు. ఈ రోజు ఉద‌యం నుంచే టీఆరెస్ మెజార్టీ రౌండ్ల వారీగా ఎలా ఇవ్వాలో అన్నీ ప్లానింగ్ చేసి పెట్టుకున్నా.. రిజ‌ల్ట్ మాత్రం వేరుగా వ‌స్తోంది. బీజేపీ రౌండ్ రౌండ్‌కు పెరుగుతూ పోతుంటే.. టీఆరెస్ వెనుక‌బ‌డి పోతూ ఉంది. అదేందీ..? ఒక‌ట‌నుకుంటే ఒక‌టి ..ఎలా ఎప్పుడు అని.. ఏదో ఇవ్వాలి కాబ‌ట్టి.. అలా అన్య‌మ‌న‌స్కంగా.. ఓ పార్టీకి ఎన్ని ఓట్లు అని ఇచ్చేసి.. ఓట్ల శాతం ఓ గ్రాఫిక్స్‌లో పెట్టేసి చేతులెత్తేశారు.

రౌండ్‌ల వారీగా కూడా పార్టీకి ఎన్ని అని ఇచ్చారు. మ‌రి మెజార్టీ ఏ పార్టీకి వ‌చ్చింది..? ఎన్ని ఓట్లు వ‌చ్చాయో చెప్పాలె క‌దా. మాకేం ఖ‌ర్మ‌.. మీకు కావాలంటే లెక్క‌పెట్టుకోండి.. బీజేపీ ఓట్ల నుంచి టీఆరెస్ ఓట్లు తీసెయ్యండి.. అదే మెజార్టీ అని చెప్పిన‌ట్టుంది. రౌండ్ల వారీగా కూడా టేబుల్ వేశారు. అందులోనూ మెజార్టీ కాలం పెట్ట‌లేదు. అలా పెట్ట‌కుండా బీజేపీ మీద త‌మ క‌సి తీర్చుకున్నార‌న్న మాట‌.

ఈ ప‌త్రిక ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి పాపం.. స్వ‌యంగా హుజురాబాద్ ప‌ర్య‌టించారు. హ‌రీశ్‌కు తోడుగా నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చి .. న‌మ‌స్తే తెలంగాణ టీమ్‌ను ఇందులో ఇన్‌వాల్వ్ చేసి వారికి ఎలాగైనా టీఆరెస్‌ను గెలిపించాల‌ని తాయిలాలు, ప్రోత్సాహ‌కాలూ ప్ర‌క‌టించాడు. ఇచ్చాడు. ఇంత శ‌క్తి, శ్ర‌మ‌ను ధార‌పోయినా.. గెలుపును చేరుకోలేక‌పోయాడు ఎడిట‌ర్‌. హ‌రీశ్ వ‌ద్ద‌, ఇటు కేసీఆర్ వ‌ద్ద మంచి మార్కులు కొట్టేయాల‌ని ఎంతో త‌పన ప‌డ్డాడు కానీ, కాలేదు. ప్చ్‌…. ఇలా న‌మ‌స్తే ఇంట‌ర్ నెట్ ఎడిష‌న్‌లో త‌న కోపం, క‌సి బీజేపీ మీద చూపించుకుంటున్న‌ట్టున్నాడు.