చచ్చిన పామును పదే పదే చంపుతున్నాడు కేసీఆర్. ఎక్కడ కలిసినా మర్యాదగా, గౌరవంగా ‘పెద్దలు’ అని కేసీఆర్ సంభోదించగానే జానారెడ్డి పులకించేవాడు. చిన్నపిల్లాడిలా పరవశించేవాడు. తనను, తన సీనియారిటీ ని సొంత పార్టీ నేతలు కనీసం గుర్తించకున్నా.. కేసీఆర్ గుర్తించి గౌరవిస్తుండని గర్వంగా ఫీలయ్యేవాడు. అందుకే ఆయన కూడా అప్పుడప్పుడు కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని చూపేవాడు. అవకాశం వచ్చిన ప్రతీసారి సర్కారును పొగిడి రుణం తీర్చుకునేవాడు. ఐదు రూపాయల భోజనం కమ్మగా ఉందని బ్రేవ్ మనిపించడం కూడా ఇందులో భాగమే.
కానీ కేసీఆర్ ఈ మధ్య వేదికల మీద పెద్దలు జానారెడ్డి గాలి తీసేస్తున్నాడు. 24 గంటల కరెంటు ఇస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ అది తన పార్టీ మైలేజ్ కు వాడుకోవడంతో పాపం ‘పెద్దలు’ జానారెడ్డి చాలా నొచ్చుకుంటున్నారట. ‘అప్పుడు అలా మునగ చెట్టు ఎక్కించింది ఇందుకా?’ అని తెగ ఫీలైపోతున్నాడట. ‘ఏదో ఫ్లో లో మాట్లాడానే అనుకో.. ఇలా పదే పదే గుర్తు చేస్తూ గుండెల్లో గునపాలు దింపాలా కేసిఆర్’. ‘పెద్దలు అని పిలిచి మరీ ఇలా ప్రతీకారం తీర్చుకున్నట్లు ప్రవర్తించడం ఏం బాగాలేదు కేసీఆర్’ …. అని ఆయన తన సన్నిహితుల వద్ద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడట.