ఇప్పుడు అందరి దృష్టీ హుజురాబాద్ మీద పడింది. అక్కడ ఉప ఎన్నిక జరగడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ… అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆరైతే దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు. పాలన మొత్తం అక్కడే కేంద్రీకరించాడు. సర్వ శక్తులూ మోహరింపజేశాడు. ఈటలను ఒంటరి చేయడంలో సక్సెసవుతున్నాడు. తను ఎలాగోలా విజయం సాధించడం మీదే దృష్టి పెట్టాడు. బరిలోకి ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును దించాడు. హరీశ్ అక్కడి నుంచి అందరినీ లాగుతున్నాడు. కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.
హుజురాబా్‌లో ఎక్కడ చీమ చిటుక్కుమన్న అటు కేసీఆర్‌కు ఇటు హరీశ్‌కు తెలిసిపోతుంది. తెలవాల్సిందే. ఫోన్ల ట్యాపింగ్ కూడా కొనసాగుతుంది. అది ఇక్కడ మరింత తీవ్రమయ్యింది. దీంతో హుజురాబాద్ బీజేపీ నేతలు తమ ఫోన్ నెంబర్లను మార్చేసుకున్నారు. తమ పాత ఫోన్లను పక్కన పడేశారు. కొత్త ఫోన్లతోనే సంభాషణలు చేస్తున్నారు. ప్రతిపక్షాల ఎత్తుగడలు తెలుసుకోవడం వాటిని చిత్తు చేయడం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఇప్పుడు తన శక్తినంతా ఒక్క చోటే కేంద్రీకరిస్తే ఎలా ఉంటుంది? గిలగిలా కొట్టుకుంటున్నారు బీజేపీ నేతలు. ట్యాపింగ్ బారి నుంచి బయటపడ్డామని అనుకుంటున్నారే గానీ.. టీఆరెస్ కబంధహస్తాల నుంచి ఎలా పారిపోగలరు. చిక్కిశల్యం కావాల్సిందే. మట్టికరవాల్సిందే. మట్టికొట్టుకుపోవాల్సిందే. పాపం బీజేపీ…
