వాస్త‌వం – హైద‌రాబాద్‌!

క‌విత ఎక్క‌డ‌..? ఆచూకీ తెల‌ప‌డంటూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు ఆమె పై వ‌న్‌టౌన్‌లో ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆమె తీహార్ జైలులో ఉన్న స‌మ‌యంలో ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ది. ఆ స‌మ‌యంలోనే ఆమెను ఎయిమ్స్‌లో చూపించారు. గైనిక్‌, ఇత‌రత్రా స‌మ‌స్య‌ల‌తో ఆమె బాధ‌ప‌డుతున్నద‌ని తెలుసుకుని వైద్య ప‌రీక్ష‌లు చేపించి పంపించారు. బెయిల్‌పై వ‌చ్చిన త‌రువాత కూడా ఆమె కోలుకోలేదు. కేసీఆర్ స‌తీమ‌ణి, క‌విత త‌ల్లి శోభ‌మ్మ కూడా తీవ్ర అనారోగ్యం బారిన ప‌డ‌టంతో ఆమెతోనే ఆస్ప‌త్రిలో గ‌డిపిందామె.

ఇవాళ క‌విత మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరారు. నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన ఆమె..వైద్య పరీక్షల కోసం సాయంత్రం వ‌ర‌కు అక్క‌డే ఉండ‌నున్నారు. బ‌తుక‌మ్మ పండుగ‌కు ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌నంతో మ‌మేకం అవుతార‌ని భావించినా.. ఆమె ఆరోగ్యం దృష్ణ్యా బ‌య‌ట‌కు రాక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.