(దండుగుల శ్రీనివాస్)
వాస్తవం … ముందే చెప్పింది. అసలు డబుల్ బెడ్ రూం ఇండ్లు యాడున్నయ్ రా బై..! అని. కేసీఆర్ డబుల్ ఇండ్ల స్కీంతో జనాలను మోసం చేసిండు. ఘోరంగా ఆ స్కీం విఫలమైంది. ఇప్పుడు ఈ సర్కార్ వచ్చి ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఐదు లక్షలిస్తామంటూ మరోసారి టోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నదని. సేమ్ అదే నిజమైంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని సర్కార్ ప్రకటించి వారిని మోసం చేసే ప్రయత్నం చేసింది. కానీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పటికే చాలా మందికి ఇవ్వాల్సి ఉండే.
దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది వెయిటింగ్ చేస్తున్నారు. వారిని కాదని ఇప్పుడు మూసీ నిర్వాసితులకు ఇచ్చేందుకు వారిని తరలించడంతో దరఖాస్తులు చేసుకున్నవారంతా వచ్చి లొల్లి లొల్లి చేశారు. చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు రేవంత్ సర్కార్ ఆడిన డబుల్ గేమ్ ఇలా బట్టబయలైంది.