సీన్‌ రివర్స్‌…. ప్రతిపక్షం పరార్‌… రోడ్డెక్కిన అధికార పక్షం

సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా అధికార పార్టీ పై ప్రతిపక్షాలు తిరగబడతాయి. నిరసనలు చేపడతాయి. ధర్నాలు చేస్తాయి. కానీ ఇక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్ పై అధికార పక్షం బీఆరెస్ తిరగబడింది. రోడ్డెక్కింది. దిష్టి బొమ్మల దహనాలు చేసింది. రేవంత్ రెడ్డి చేసిన ఉచిత కరెంట్ వ్యాఖ్యలు ఆ పార్టీ కి షాక్ నిచ్చాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రైతులు, బీఆరెస్ శ్రేణులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ వైఖరి పై దుమ్మెత్తి పోశారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ కి ఈ మధ్యే కొంత ప్రాణం వచ్చింది. రైతు డిక్లరేషన్ చేసినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కర్ణాటక ఫలితాలు ఊపు తెచ్చాయి. ఆ లోపే రేవంత్ చాపలత్వం కోన ఊపిరి పోసుకుంటున్న పార్టీని చంపేసింది. దీంతో అధికార పక్షం పై పోరాడాల్సిన ప్రతిపక్షం కలుగులో దూరగా, అధికార పక్షం ఇలా రోడ్డెక్కింది.

You missed