మోడీ అవినీతిని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని ఆయన్ను ఎదుర్కోలేక ఆయన బిడ్డ కవితమ్మ మీద నిరాధార ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని..ప్రజల సొమ్ము లక్షల కోట్లు కాజేసిన మోడీ దోస్త్ అదానీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అని రాష్ట్ర ఆర్అండ్‌బీ, శాసన సభ వ్యవహారాల శాఖ మినిష్టర్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కవితమ్మ పై బిజెపి చేస్తున్న కుట్రలో భాగంగా ఆమెపై ఏమన్నా జరుగారనిది జరిగితే ప్రజల పక్షాన పోరాడుతున్న కవితమ్మ కి మద్దతు తెలపాలని మంత్రి కోరగా అక్కడకు వచ్చిన మహిళలు ప్రజలు కవితమ్మ కి అండగా ఉంటామని తెలుపుతూ చేతులెత్తి సంపూర్ణ మద్దతు తెలిపారు.బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం బడాభీంగల్ గ్రామంలో 7కోట్ల 77 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 112 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని(కేసిఆర్ కాలనీ)ఆదివారం నాడు మంత్రి ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి,వారితో గృహ ప్రవేశం చేయించారు.

మోడీ అరాచక పాలనను రైతులు,పేదల పక్షాన కేసిఆర్ ప్రశ్నిస్తున్నందుకే…

మోడీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని మంత్రి మండిపడ్డారు. తనకు అనుకూలమైన అదానీ లాంటి కార్పొరేట్ దోస్తులకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారనీ,ఆ మాఫీ చేసిన డబ్బులతో బీజేపీ ప్రత్యర్థి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొంటూ అక్కడి ప్రభుత్వాలను కూలదోస్తున్నరని మండిపడ్డారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కూలదోయాలని కుట్రలు చేస్తే కేసిఆర్ అడ్డు పడ్డారని అన్నారు. గ్యాస్,పెట్రోల్, డీజిల్,ఎరువుల ధరలు రెట్టింపు చేశారని దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతుందన్నారు. పేదలను,రైతులను పీడిస్తూ…తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్న మోడీని కేసిఆర్ ప్రశ్నిస్తున్నాడని అందుకే కేసిఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరన్నారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద సమగ్ర విచారణ చేయాలని పార్లమెంట్లో ప్రతి ఎంపి డిమాండ్ చేస్తున్నాడని దానిపై ఎలాంటి స్పందనా లేదన్నారు. ఎల్ఐసి,ఎస్బిఐ లో ప్రజల దాచుకున్న డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ…సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నరని బీజేపీ మోడీ ప్రభుత్వ కక్ష్య పూరిత వైఖరిపై మంత్రి మండిపడ్డారు.

డబుల్ బెడ్రూంలకు మోడీ రూపాయి ఇయ్యలే..మొత్తం కేసిఆర్ పైసలే

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం మాటలు తప్పా..రూపాయి సాయం లేదన్నారు. బాల్కొండలో కట్టిన ప్రతి డబుల్ బెడ్రూం ఇల్లు కేసిఆర్ ఇచ్చిన పైసలతో కట్టిందే…బీజేపీ మోడీది రూపాయి కూడా లేదన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద ప్రతి ఇంటికి 72వేల రూ. కేంద్రం ఇవ్వాల్సిఉండగా రూ.కూడా ఇవ్వలేదని అన్నారు. ఒక్కో ఇంటి మీద సుమారు 10 లక్షలు కేసిఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

బాండ్ పేపర్ వాల్యూ పోగొట్టిన అర్వింద్…కేంద్ర కిసాన్ సమ్మాన్ యోజన ఎంత మందికి వస్తుంది..?
పసుపు బోర్డు పేరుతో రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసి ఎంపి అయిన అరవింద్..బాండ్ పేపర్ కున్న వాల్యూ పోగొట్టాడని ఎద్దేవా చేశారు. రైతుబంధును కాపీ కొట్టి ప్రవేశపెట్టిన ప్రధానికిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలోఎంత మందికి వచ్చింది..ఇప్పుడు ఎంత మందికి వస్తుందో..ఎంపి అర్వింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధు కింద కేసిఆర్ ఎకరానికి 10 వేలు ఇస్తున్నారని ఏటా లబ్ది దారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ప్రధాని కిసాన్ యోజన లబ్దిదారుల సంఖ్య తగ్గుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్,కెటిఆర్, కవితను తనను ఫేస్ బుక్ వేదికగా తరుచూ తిట్టే అరవింద్ అదే ఫేస్ బుక్ లో తన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.

రాష్ట్రంలో ప్రతి గడపకు కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎవరు మంచి చేస్తున్నారో..ఎవరు మాటలు చెప్తున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. రైతులు,పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసిఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కేంద్ర బీజేపీపై ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని కోరారు.

You missed