వాస్తవాలు మాట్లాడితే ఎవ్వరికైనా నచ్చదు! బీజేపీ రేపటి నుండి తెరాస సర్కారు మీద సోషల్ మీడియాలో సాలు దొర -సెలవు దొర అనే కార్యక్రమం ను ప్రచారం చేయాలనీ నిర్ణయించిందట….. ఆ పార్టీ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉన్నదన్నది కాదనలేని విషయం….. తెరాస కు లక్షల మంది కార్యకర్తలు, వేలమంది నాయకులు ఉన్నారు కద…వీళ్లు అందరు తలచుకుంటే సోషల్ మీడియా షేక్ అవుతది కద…చాలా మంది ఎంతసేపు కెసిఆర్, కేటీర్, హరీష్ రావు కవిత, సంతోష్, ఇతర మంత్రుల ఫోటోలు పెట్టుకునేంత ఇంట్రస్ట్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు పోస్ట్ చేయడం లేదు!
ఎవరిని వారు estabish చేసుకోవడం తప్పు కాదు… పార్టీ ని, కెసిఆర్ ను డిఫండ్ చేయాలె కద… వ్యతిరేక పార్టీని ట్రోల్ చేయాలె కద..బర్త్ డే లు, పెండ్లి రోజులు, ఏదయినా achievment సాధిస్తే పోస్టులు పెట్టుకోవచ్చు.. పది మందికి చెప్పుకోవచ్చు…కని తెరాస సాధించిన ఘనతలు, పక్క పార్టీ ల బలహీనతలు అస్సలు ఎక్సపోజ్ చేయడం లేదు.కొందరు చేస్తున్న ప్రజల్లోకి బలంగా పోతలేదు….ఎంత మంది మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు నామినేటెడ్ పదవులు పొందిన వారు జిల్లా నుండి గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు బీజేపీ కి వ్యతిరేకం గా పోస్ట్ చేస్తున్నారు.. పోస్ట్ చేయక పోయిన కనీసం షేర్లు, లైక్స్, కామెంట్స్ కూడా చేయడం లేదు. .వాస్తవానికి తెరాస చాలా చేసింది, చేస్తోంది….గిట్ల అయితే ఏమి చేయలేదని పక్క పార్టీ చేసే ప్రచారమే ప్రజల్లోకి పోతది….
Venkata Ramana Rao Nellutla
