మోడీ స‌భ స‌క్సెస్‌కు టీఆరెస్ ఓవ‌రాక్ష‌న్ కూడా ఓ కార‌ణ‌మైంది.  మోడీరాక‌, మీటింగును దృష్టిలో పెట్టుకుని యాక్ష‌న్‌కు దిగింది. దీనికి ప్ర‌తిచ‌ర్య‌గా బీజేపీ దీన్ని చాలెంజింగ్‌గా తీసుకున్న‌ది. బల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగింది. జ‌న ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అంతిమంగా స‌భ స‌క్సెస‌య్యింది. బీజేపీలో జోష్ పెంచింది. డ్యామిట్ క‌థ అడ్డం తిరిగింద‌ని టీఆరెస్ క‌సిగా తిట్టుకుంటున్న‌ది. వాళ్ల ప్రోగ్రామేదో వాళ్లు చేసుకోని పోతారులే అని లైట్‌గా తీసుకుని ఉండాల్సింది కేసీఆర్‌. కానీ అలా చేయ‌లేదు. ఆర్బాటం చేశాడు. హంగామా సృష్టించాడు. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా హోర్డింగులు, యాడ్లు… మీటింగులు, ప్ర‌శ్న‌లు… నిల‌దీత‌లు…. ఇవ‌న్నీ కాద‌ని య‌శ్వంత్ సిన్హాకు భారీ ర్యాలీ, ఊరేగింపు… ఎన్ని విధాలుగా రెచ్చ‌గొట్టాలో అన్నీ చేశారు. మోడీ మాత్రం రాజ‌కీయాల జోలికి పోకుండా, తాపీగా అభివృద్ధి పాఠం అప్ప‌జెప్పి చ‌ల్ల‌గా జ‌రుకున్నాడు. అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. కనీసం కేసీఆర్, టీఆరెస్ పేరు కూడా తీయ‌లేదు. కేసీఆర్ ఇలా రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు దిగ‌క‌పోతే.. టీఆరెస్ గురించి ఏదైనా అనేవాడేమో తెలియ‌దు కానీ… టీఆరెస్ చ‌ర్య చూసిన త‌ర్వాత‌.. ప్ర‌తిచ‌ర్య ఇలాగే ఉండాల‌నుకున్నారు. అలాగే చేశారు.