ఏ ఊకో.. బోడిముండ తలాతోకలేని వాదన… నీకు కూడా ఉండాలకదనయ్యా జ్ఞానం.. ఏది వడితే అది అడుగుతవ.. ముందు చెప్పు దీనికి ఆన్సర్..? ఎవడా నిపుణుడు..? ఎవడా విపక్షం..? చెప్పు వాని పేరు చెప్పు…?
ఇలా సీఎం కేసీఆర్ దబాయించింది… బెదిరించింది.. ఇరకాటంలో పెట్టింది.. సెల్ప్ డిఫెన్స్‌లో పడేసింది.. ప్రశ్నించినందుకు ఫ్రష్టేషన్ అంతా వెళ్లగక్కింది.. ఎవరి మీదో కాదు.. ఓ విలేకరి మీద. సహజంగానే సీఎం ప్రెస్‌మీట్ అంటే ఏదో అడగాలె. కానీ సార్ మూడ్‌ను బట్టి అడగాలని, అది ఆయనకు అనుకూలంగా ఉండాలని, రెచ్చగొట్టేదిగా.. పిచ్చిలేపేదిగా.. కోపం నశాలనికంటేదిగా ఉండొద్దని పాపం ఆ విలేకరికి తెలియదనుకుంటా.
బహుశా కొత్తగా వచ్చిండో.. లేక కేసీఆర్ సహనాన్ని పరీక్ష పెట్టి ఇంకింత రెచ్చగొట్టాలని కావాలని చేసిండో తెలియదు కానీ. బుద్దిలేదు..జ్ఞానం లేదు నీకు అని మాత్రం తిట్టించుకున్నాడు. ఇదేమీ మన విలేకరులకు కొత్త కాదనుకో. నిన్న మాత్రం పెద్ద సారు మస్తు గరం గరం మీదున్నడు. కదిలేస్తే మాటలతో కాల్చి పారేస్తున్నాడు. తన వాక్ప్రావాహాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాలేదు. అడ్డుకునే ప్రయత్నం చేసే దమ్మూ ఎవరికీ లేదు.
ఆ సమయంలోనే ఇలా ఓ విలేకరి తలుగుకున్నాడు. ఏదో అడ్డగోలు ప్రశ్నే అడిగుంటాడు. లేకపోతే కేసీఆర్‌కు అంతాల కోపమెందుక వస్తది..? ఆ లెక్కన కేసీఆర్‌కు కోపమే రాదు.. శాంత స్వరూపుడు. ఓపిగ్గా సమాధానం చెబుతాడు.. అని అనుకునేరు. ఆయన స్టైలే అంతా. ప్రశ్నించినోడి మీద విరుచకుపడటం. ఈ స్టైల్ మన డీఎస్ దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. డీ శ్రీనివాస్ కూడా అంతే. ఏదైనా ప్రశ్నిడిగితే దానికి ఉల్టా మరో ప్రశ్నవేస్తాడు. సమాధానం మాత్రం రాదు. ఇంకో రిపోర్టర్ ఏదన్నా అడగాలంటే జడుసుకుని, తడుముకుని, సర్దుకుకని, నోరు మూసుకుని … కామ్‌గా కూసిండిపోవాలె తప్ప తమ పరిజ్ఞానాన్ని వీళ్ల ముందు ప్రదర్శిద్దామని చూస్తే ఇలా అజ్ఞానులై మిగిలిపోతారు. నలుగురిలో నవ్వులపాలవుతారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టైల్ కొంచె వేరు. కానీ ఆయనా వీళ్ల బాపతే. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడమన్నమాట. వెటకారంగా, వెక్కిరింపుగా, పైత్యాన్నంతా రంగరించి అలా అలవోకగా ఆన్సర్ ఇచ్చి.. అడిగినోన్ని అలా అలా నల్లబాలు లెక్క నాకి చంపేసే రకం అన్నమాట.
సరే, గానీ విలేకరులు మీరు సీఎం ప్రెస్‌మీట్‌లో అడిగేటప్పుడు జర జ్ఞానంతో మాట్లాడండి.. దీనికన్నా మనం ఏమీ అడగకుండా నవ్వుముఖంతో ఏడుపు కనబడకుండా.. వైరాగ్యం ప్రదర్శించకుండా .. అలా గమ్మున కూర్చిండి… పోయేటప్పుడు ఆయన నజర్‌లో ఓసారి పడేలా ప్రయత్నించి.. ఇక జీవితానికి ఇది చాలు అని అనిపించుకుంటే పోలా…! ఇలా ఇజ్జత్ తీసుకునుడు అవసరమా..?