భారీ బ‌హిరంగ స‌భ‌.. కిక్కిరిసిన జనం. క‌ళాకారుల ఆటాపాట‌లు..ధూమ్ ధామ్‌తో ద‌ద్ద‌రిల్లిపోవాలె. టీవీలల్ల లైవ్ షోల‌తో హోరెత్తిపోవాలె. అనుకున్న సమ‌యానికి పెద్ద‌సారు గంటో రెండు గంట‌లో ఆలిస్యం రావాలె. అప్ప‌టిదాక చిట్ర‌బొట్ర లీడ‌ర్లంతా మాట్లాడెయ్యాలె. పెద్ద సారొచ్చ‌స‌రిక‌ల్లా స్పీచులు దండుచు బంజెయ్యాలె. గా సాయిచంద్ మాత్రం.. మాం.. చి పాటందుకుని సారును ఖుషీ జెయ్యాలె. రాంగ‌నే ఓ ఐదు నిమిషాలు కూడా కూసోవద్దు.. సారును మాట్లాడ‌మ‌నాలె. ఇగ సార్ అర్సుకోవాలె. అదీ స‌భంటే. టీఆరెస్ బ‌హిరంగ స‌భంటే. ఏ ఎన్నికున్నా చివ‌ర్ల సారిచ్చే బ‌హిరంగ స‌భ‌ స్పీచ్ కిక్కే వేర‌ప్పా…!

ఇగో గీ హుజూరాబాద్‌ల సుక గ‌ట్ల‌నే ఆఖ‌ర్ల అర్సుకుందామ‌నుకున్న‌డు. పెతిప‌క్షాల‌ను క‌ర్సేద్దామ‌నుకుండు. పువ్వు పార్టోళ్ల‌ను పాతేద్దామ‌నుకుండు.. గిదేందీ.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అంట‌… చుట్టుప‌క్క‌ల గూడ స‌భ‌లు పెట్టుకోవ‌ద్దంట‌. ఇచ్చిత్రం గాక‌పోతే.. మేమ‌న్న ఎల‌చ్చ‌న్లు కొత్త‌గ సూస్తున్నామూ.. అయినా స‌రే ఒదిలేది లేదు. క‌డిగిపారేయ‌కుండా ఇడిసేదీ లేదు. అగో గందుకే రోడ్ షో లైనా ప‌ర్వాలేదు హ‌రీశా..! గ‌వి ఏర్పాటు జెయ్యి రెండు రోజులు.. మీరిన్ని రోజులు ప‌డ్డ క‌ష్టం ఒకెత్త‌యితే.. ఈ రెండ్రోజుల్లో మొత్తం చీపురు పెట్టి ఊడ్చేసిన‌ట్టు నా ప్ర‌సంగాల‌తే ఊడ్చి పాడేసి హుజురాబాద్‌ను మ‌న ఖాతాలో ఏసేసుకోని వ‌చ్చేత్తా..

అంత బాగానే ఉంది గానీ పెద్ద‌సారూ..! బ‌హిరంగ స‌భ‌లో నీ ప్ర‌సంగాల‌కు ఎవ‌లూ అడ్డం ప‌డొద్దు. స‌ప్పుడు సేయ్య‌ద్దు. స‌ప్పుడ్దాంక ఇనాలె. లొల్లి జేస్తే నీకు సిరాకు. గీ రోడ్ షోల‌ల్ల పోర‌గాళ్లు సైలెంటుగుంట‌రా..? గాయి గ‌త్త‌ర జెయ్య‌రూ..? నువ్వొక‌ట‌నుకుంటే ఆడ ఇంకొక‌టైతే.. గీ రోడ్‌షోలు గీడ్ షోలు మ‌న‌క‌వ‌స‌ర‌మంట‌వా…? మ‌న హ‌రీశు సూస్కుంటుగా.. స‌క్క‌గ‌నే. రాత్రిప‌గ‌లూ.. నిద్ర‌హారాలు మాని.