అవును ఎన్నికల ఖర్చు అంతకు మించి పెట్టొద్దు. కాబట్టే 28 లక్షలు. లెక్కాపత్రం ఉండాలి కదా. ఇదేందీ? అక్కడ 28 లక్షలతో గెలుస్తారా? మ చెవిలో పువ్వు పెడుతున్నారా? అనుకుంటున్నారు. ఎవరూ అక్కడ 28 లక్షలే ఖర్చు పెడుతున్నారని అనుకోరు.ఆఖరికి చిన్న పిల్లగాడు కూడా. ఇవి కేవలం ఎన్నికల ఖర్చు కోసమే.
వాళ్లే చెప్తున్నారు కదా. ఎన్నికల ఖర్చు కాకుండా ఇంకా ఏమేమీ ఉంటాయేందీ? అని అనుకుంటున్నారు. అదే గెలుపు కోసం పెట్టే ఖర్చు వేరే ఉంటుంది. అదెలా ఉంటుంది. దానికెంతవుంది?. దానికే అవుతుంది అసలు ఖర్చు. వందల కోట్లు. అమ్మో.. వందల కోట్లా… ? నిజమా? . నిజమా అంటే నిజమే. అక్కడ హుజురాబాద్‌కు పోయి ఎవరినడిగినా చెబుతారు. నాయకులను కొనడం, రోజు తిండీ, తాగుడు, డబ్బుల పంపకం, మీడియా ప్యాకేజీ, సొంత పార్టీ వాళ్లకు నజరానా, అవతలి పార్టీ వారి డబ్బుల గాలం, పదవుల పందేరం.. మరి వీటన్నింటికీ వందల కోట్లు ఖర్చు కాదా?
ఏ ఊకో.. ఆడ అంతగానం సీనుందా ఈటలకు. అంత ఖర్చెందుకు పెడతరు? ఈటలకు అంత సీన్ ఉందో లేదో తెలియదు కానీ, వందల కోట్లు గెల్లు గెలుపు కోసమైతే పెడుతున్నరు బాసు. మొన్నటి వరకు.. అంటే షెడ్యూల్ రాకముందే రెండు మూడు వందల కోట్లు ఖర్చయ్యాయి తెలుసా? అవునా. మరి ఏమనుకుంటున్నారు. ఇగ ఈ నెల రోజలు ఖర్చుకు వెనుకాడేది లేదు. ఎంతైతే అంత. ఎన్నైతే అన్ని. ఎక్కడ బడితే అక్కడ. ఎవరికి బడితే వాళ్లకు. ఎడాపెడా, చెడామడా పెట్టుడే, గుంజుడే. వేసుడే. గెలుచుడే. అదీ సంగతి.
అబ్బ.. హుజురాబాద్ ఓటర్లను తలుచుకుంటునే ఒక మాట అనాలనిపిస్తుంది బాసు.. అనేదా?. ఇంకేం ఆలస్యం అనెయ్..
సుఖీభవ..! సుఖీభవా..!!