వరి సాగులో మనమే భేష్.. దేశానికే అన్నం పెడుతున్నం.. ఆదర్శంగానిలుస్తున్నాం.. అని గొప్పగా మనం చెప్పుకుంటాం. కానీ ఆ వరి సాగు వల్ల రైతులకు ప్రయోజనం లేదు. అంతా ఇదే సాగుపై ఆధారపడటంతో మనకు కావాల్సిన వరికి మించి ఏడింతలు ఎక్కువగా తెలంగాణలో సాగువుతుందట. ఎక్కవుగా ఉత్పత్తైన వరిని .. ఎగుమతి చేయలేక,మనం సరైన మద్దతు ధర ఇచ్చే విషయంలో తలకు మించిన భారం కాగా… మరోవైపు ఇది రైతుకు అనుకున్నంత లాభాలను తెచ్చిపెట్టక … అన్ని రకాలుగా ఇబ్బందులే వస్తున్నాయి.
ఇప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ కొంటలేదు కాబట్టి.. వరి వేయకండని, వేస్తే ఉరేననే మాటలు వినిపిస్తున్నాయి. కానీ మన అగ్రికల్చర్ పాలసీయే శుద్ధ తప్పుగా ఉందంటున్నాడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ఇతను వ్యవసాయ సాగుపై ఓ వీడియో చేశాడు. కంటెంట్ బాగుంది. వివరాలతో కూడిన విశ్లేషణ బాగుంది. ఇందులో చెప్పొచ్చేదేమంటే…చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చిరుధాన్యాలే అధికంగా పండిస్తున్నారంట. కొర్రలు, మినుములు, తైదలు, సజ్జలు.. ఇలా. మరి మన దగ్గర ప్రభుత్వ ఎందుకు వీటికి ప్రోత్సహించడం లేదని అడుగుతున్నాడు కొండా.
వీటిని సరైన మద్ధతు ధర ఇస్తామని సర్కారు రైతుల్లో భరోసా నింపి రైతును ఇటువైపు తీసుకుపోవచ్చు కదా.. ఎందుకు చేయడం లేదు ఇప్పుడు కేంద్రంపై బియ్యం కొనడం లేదని సాకు చూపి చేతులెత్తేయడం కరెక్టు కాదంటున్నాడు. చత్తీస్ ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. రాజకీయాలు పక్కన పెట్టి.. బీజేపీతో కలిసి రైతులకు మేలు చేస్తున్నాయి… అలా మనమెందుకు చేయలేం..? అని అడుగుతున్నాడు. వ్యవసాయ రంగం పూర్తిగా వరిమయమై ఇబ్బంది కరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో కొత్త విషయాలను చెప్పింది. విస్తుపోయేలా ఉన్నా.. ఇవి నిజాలు కూడా. లోపం తెలుసుకుని పాలసీలుమార్చకుంటే అందరికీ మంచిదే.