పొద్దున్నే ఓ హెల్త్ ఆఫీసర్ తో మాట్లాడిన.
కరోనా థర్డ్ వేవ్ పరిస్థితి ఏందని.
ఇంకా ఆ ఛాయలు లేవన్నాడు. వస్తుందనే భయం వెంటాడుతుందన్నాడు.
కానీ వ్యాక్సిన్లు ఎక్కువగా వేసుకుంటే దీని తీవ్రత ఉండదని, మరీ రిస్క్ ఉండదని అన్నాడు.
డెంగ్యూ వైరసే ఇప్పుడు భయపెడుతున్నదని, అది మెల్లగా విస్తరిస్తున్నదనీ చెప్పాడు.
వ్యాక్సిన్ ప్రక్రియ ఎలా కొనసాగుంతుందని అడిగిన.
“బాగానే ఉంది. కానీ.. ముస్లిం ఏరియాల నుంచి పెద్దగా స్పందన లేదు బై” అన్నాడు.
“ఎందుకు?”
“ఏమో.. వాళ్లది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటా..”
“అంటే ఏమీ కాదనా..?”
“అంతే కదా. మొన్నటి వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డమో అందరూ చూసిండ్రు. మళ్లీ వీళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్నా.?”
“అసలు ఇంట్రస్టు చూపిస్త లేరు బై.”
“అంతటా మంచిగా అయితుంది వ్యాక్సినేషన్. ఇక్కడ మాత్రం చాలా స్లోగా ఉంది.”
“అంతటా 60 -70 శాతం వరకు పోతే.. ఇక్కడ 10-20 దాటడం లేదు.”
“అవునా..?”
“ఫస్ట్ డోస్ ఏపిచ్చుకున్నోడు.. సెకండ్‌కు వస్తలేడు. ఫస్టే ఏపిచ్చుకోనోడు ఇటువైపే వస్తలేడు.”
“మరి మీరు ప్రచారం చేయొచ్చుగా.”
!ప్రచారమా? మాకంత టైముందా?”
“ఒకరిమీద ఒకరు పడి వ్యాక్సిన్ల కోసం బారులు తీరుతున్నారు. ఇదే సరిపోతలేదు.”
“ఇంక మేం పోయి ప్రత్యేకంగా ప్రచారం ఎక్కడ చేసేది?”
“మరి ప్రమాదమే కదా?”
“ప్రమాదమే మరి. వాళ్లు ఇంకొకరికి అంటిస్తరు. అట్లనే కదా స్ప్రెడ్ అయ్యేది. చెప్తే వినరు.”
“మరి వాళ్లకు వ్యాక్సిన్లు వేయించడం ఎలా?”
“మిగిలిన వారంతా ఏపిచ్చుకుంటే.. ఇలాంటి మిగిలిపోయిన కొంత సెక్షన్ ఉన్నా.. పెద్దగా ఫరఖ్ పడదు. తీవ్రత తగ్గుతుంది.”
“ఆ తర్వాతనైనా బద్ది తెచ్చుకుంటారు. ప్రాణాల మీదకు వచ్చినంక ఉరుకులు పరుగులు పెడతరు.”