అతి భారీ వర్షాలు… రోడ్లన్నీ జలమయం . ఇలాంటి పరిస్థితుల్లో .. కలరా, టైపాయిడ్ , డయేరియా , , డిసెంట్రీ , గ్యాస్ట్రో ఎంటరైటిస్, లెప్టో స్పిరోసిస్ , హెపటైటిస్ – ఏ, నిమోనియా , బ్రోన్కైటీస్ , ఆస్తమా, రింగ్ వర్మ్ లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముంది . ఇప్పటికే మలేరియా , చికున్ గున్యా , డింగీ లాంటి వ్యాధులు లక్షలాది మందిని అనారోగ్యం పాలు చేసాయి . ఇప్పుడు అవి మరింత విజృంభించే ప్రమాదముంది .

వర్షపు నీటిలో ఆడుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో సరదా.. అలవాటు కూడా . కానీ కాలం మారింది . జనాభా పెరిగింది .
వ్యక్తుల్లో ఇమ్మ్యూనిటి తగ్గింది . ఆంటీ బయాటిక్ లో అతిగా వాడడం వాళ్ళ అవి పని చెయ్యకుండా పోతున్నాయి .
మురుగు నీరు… వాన నీటిలో కలిసిపోయే స్థితిలో నేడు పట్టణాలు , గ్రామాలు .

అందరూ తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు .

1 . మరో వారం పది రోజులు మరగ బెట్టిన నీటినే తాగండి .
2 . ఉడికించని ఆహార పదార్థాలు { పచ్చి క్యారెట్ , ఖీర లాంటివి తీసుకోవద్దు . తీసుకోవాలంటే వాటిని కాసేపు వేడి నీటిలో ఉంచండి } .హోటల్ నుంచి తెప్పించిన పార్సెల్ లో పచ్చి చట్నీ లాంటివి ముట్టుకోవద్దు .
3 . మీ ఇంటి చుట్టూ ఉన్న నీరు ఎంత వీలైతే అంత త్వరగా వెళ్లి పోయేట్టు చేయండి . నిల్వ యున్న నీరు దోమల ప్రసూతి కేంద్రం .
4 . నీటిలోకి అనవసరంగా వెళ్లకండి . తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే చేతికి కాళ్లకు గ్లోవ్స్ లాంటివి , కనీసం ప్లాస్టిక్ కవర్లను తొడుగులుగా వాడండి .

5 . ఇంటికి వచ్చాక , చేతులు కాళ్ళు సబ్బు నీటితో శుభ్రం చేసుకోండి . ఒంటి పై పగుళ్లు , కురుపులు గాయాలు ఇది వరకే ఉంటే వాటికి బ్యాండ్ ఎయిడ్ లాంటి తొడుగులు వెయ్యండి .

 

Amarnath Vasireddy

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed