నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో రెండు తలల గొర్రెపిల్ల జన్మించింది. ఈ వింతను చూడటానికి జనం బారులు తీరారు. తొగరి లక్ష్మణ్ గొర్రెల కాపరి. వంద గొర్రెల వరకు ఉన్నాయి. ఇవాళ ఓ గొర్రె.. రెండు తలలున్న గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి జనమంతా పోగయ్యారు. వింత, అద్భుతమంటూ చేతులెత్తి మొక్కడం ప్రారంభించారు. ఇది జన్యుపరమైన లోపంతో జరుగుతుందని, రెండ్రోజులకు మించి అది బతకదని వైద్యుడు చెప్పాడు. జనం మాత్రం వస్తూనే ఉన్నారు.

