ఇప్పుడు మన సర్కార్ మనసంతా హుజురాబాద్ చుట్టే గింగిరాలు కొడుతుంది. మిగిలిన రాష్ట్రాలు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? ఎట్లా ఎదుర్కోవాలో ముందు జాగ్రత్త చర్యల్లో ఉన్నారు. మన కేసీఆర్‌కు మొదటి నుంచీ కరోనా అంటే చిన్నచూపే. ఆయన చిన్న చూపు కారణంగానే భారీ నష్టం వాటిల్లింది. ప్రాణాలు పోయాయి. అయినా ఆయన నిర్లక్ష్యం వీడడు. అదే డోలో మనస్తత్వం.
వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో ఎవరికైనా అడిగితే.. ఎవరికీ సరిగ్గా తెలియదు. ఎవరికి, ఎప్పుడు వేస్తున్నారో తెలియదు. ఎంత మంది ఫస్ట్ డోసు కోసం ఎదరుచూస్తున్నారో? ఎందరు రెండో డోస్ కోసం పడిగాపులు కాస్తున్నారో..? ఎవరికీ తెలియదు. ఎవరికి వారే వ్యాక్సినేషన్ సమాచారం కోసం ఆగమాగం తిరుగుతారు. ఎక్కడ్నో ఒక దగ్గర టీకా దొరికితే బుతకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ ఈరోజు (ఆగస్టు 3) వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు నెలకొల్పాలని సంకల్పించింది. ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా జరగని రీతిలో ఒక్కరోజులో అత్యధిక జనాభాకు టీకా వేసేందుకు సన్నాహాలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ 4 కోట్ల 87 లక్షల మందికి టీకాలు వేశారు. అయితే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మెగా డ్రైవ్ వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఈరోజు యూపీలోని 20 లక్షల జనాభాకు వ్యాక్సిన్ వేసేందుకు యోగి సర్కారు ప్రణాళిక సిద్ధం చేసింది.
మరి మన వద్ద మెగా డ్రైవ్ ఎందుకుండదు? ఈ దిశగా మన కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచన చేశాడా? మీ రాజకీయాలు, మీ పదవులు తర్వాత. ముందు జనాలు బతికుండాలె కదా. ఆరోగ్యంతో ఉండి పనులు చేసుకోవాలె కదా. అప్పుడే సంపద పుడుతుంది. మోదీతో మీ రాజకీయ అవసరాలు మాట్లాడుకోవచ్చు… వ్యాక్సిన్ కోసం ఏనాడైనా స్వయంగా సీఎం మాట్లాడాడా?
కానీ మన కేసీఆర్ సార్‌ను మెచ్చుకోవచ్చు.
ఎందులో అంటే..? ఎందుకంటే..??
ఎంత విపత్తు వచ్చినా.. మనలో ధైర్యం నింపుతాడు.
డోలో వేసుకోండి సరిపోతది అంటాడు.
నేనూ అదే వేసుకున్నా అని భరోసా ఇస్తాడు.
కానీ జనం పిరికి సన్నాసులు.. భయంతోనే ఛస్తున్నారు.