కండల వీరుడు ! చొక్కా విప్పిన మొనగాడు ! హ్యాండ్సమ్ మాన్! … ఇదీ దీనికి సంబంధించి బయట ఉన్న ప్రచారం ! డబ్బున్న వారు తిన్నది అరక్క కుక్కల్ని పెంచుకుంటారు .. అనుకోవడం లో నిజం ఎంత ఉందొ ఇందులో కూడా అంతే ! దీన్నే English లో స్టీరియో types అంటారు . మన ఒంట్లో ఎంత కొవ్వు వుంది అనేది మన ఆరోగ్యాన్ని తెలియచేస్తుంది . BMI అనేది పనికి రాని కాన్సెప్ట్ . స్కిన్నీ ఫాట్ వ్యక్తులను ఇది ఫిట్ గా చూపిస్తుంది .

పురుషుడి ఒంట్లో కొవ్వు 6 -17 శాతం మధ్యలో ఉంటే ఆ వ్యక్తి ఫిట్ గా ఉన్నట్టు . 25 శాతం దాటితే ఊబకాయం ! చాలా మందికి 50 -60 శాతం ఉంటుంది. వొంట్లో కొవ్వు అయిదు శాతానికి తగ్గితే ప్రాణానికి ప్రమాదం. కొవ్వు ముప్పై శాతం దాటితే అది slow poison. అనేక రోగాలకు అది మూలకారణం అవుతుంది. .మన శరీరం లో మిగులు Calories ఉంటే అది కొవ్వు గా మారి పోతుంది . వొళ్ళంతా కొవ్వుతో నిండిపోతుంది. కొవ్వును కరిగించడానికి షార్ట్ కట్స్ లేవు . సర్జరీ లు ఆయుర్వేద మందులు తెర‌ మీదకు తెస్తాయి .

వొంట్లో కొవ్వు కరగడం మొదలు పెడితే ఆ క్రమం లో చివరిగా కరిగేది ఉదరభాగం అందునా లోయర్ అబ్డోమెన్ అంటే నాభి చుట్టూ ఉన్న కొవ్వు . వొంట్లో కొవ్వు 12 శాతానికి తగ్గితేనే అబ్స్ కనిపిస్తాయి . లేక పొతే దానిపైన ఉన్న కొవ్వు అబ్స్ ను కనిపించనీయదు. కేవలం కొవ్వు తక్కువ ఉండడం కాదు . Muscles ఉండాలి . బోన్ డెన్సిటీ తగినంత ఉండాలి. అబ్స్ వ్యాయామం చేస్తే పొట్టపైన ఉన్న కొవ్వు కరిగిపోతుంది అనే అభిప్రాయం తప్పు . వొంట్లో మిగతా చోట్ల ఉన్న కొవ్వు కరిగాకే చివరిగా ఉదరకొవ్వు కరగడం మొదలు పెడుతుంది .

HIIT , రెసిస్టన్స్ ట్రైనింగ్, low కార్బ్ డైట్ .. ఇవన్నీ ఒక పధ్ధతి ప్రకారం జరిగితే అప్పుడు కొవ్వు 16 శాతానికి తగ్గుతుంది. ముప్పై ఏళ్ళు లోపు వ్యక్తుల్లో కొవ్వు తక్కువ ఉంటుంది కనుక 12 తగ్గించడం సులభం . ముప్పై దాటిన వారిలో దీన్ని సాధించడం అంత సులభం కాదు. సిక్స్ ప్యాక్ అంటే ఫిట్నెస్ కు సింబల్ . వ్యక్తి అత్యంత ఫిట్ గా ఉన్నట్టు ! వ్యక్తి పట్టుదలకు , దృఢచిత్తానికి , ఆత్మవిశ్వాసానికి సూచిక .

Amarnath Vasireddy

You missed