తనను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చి కవితను ఓడగొట్టి గెలిచిన ధర్మపురి అర్వింద్ ఆ తర్వాత మాట మార్చాడు. పసుపు బోర్డు కన్నా అత్యున్నతమైన విధానం తెస్తున్నాని చెప్పి ప్రాంతీయ కార్యాలయాన్ని సాకుగా చూపి తప్పించుకున్నాడు. పసుపుబోర్డు అంబాసిడర్ కారని, తను తెచ్చిన విధానం టొయోటో కారని ఏవేవో చెప్పాడు. వాస్తవానికి దీని వల్ల పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు. ఈ విధానం కవిత ఉన్నప్పుడు వచ్చిందే. తెచ్చింది. డిప్యూటీ డైరెక్టర్ పోస్టులో ఓ డైరెక్టర్ వచ్చాడు. ఓ నాలుగు కుర్చీలు, రెండు టేబుళ్లు వచ్చాయి. అంతే. దీనిపై రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పూర్తి అవగాహనతో మాట్లాడాడు. అర్వింద్ మోసాన్ని ఎండగడుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన నిజామాబాద్‌లో పెట్టిన ప్రెస్మీట్‌లో మరోసారి దీనిపై సమగ్రంగా మాట్లాడాడు. ఇది సందర్భం కూడా. కానీ, టీఆరెస్ మాత్రం అర్వింద్ మోసం పై, పసుపుబోర్డు ఇష్యూపై, పసుపు రైతుల సమస్యలపై మాట్లాడటం ఏనాడో మానేసింది. ఎవరో చెబితే తప్ప వారి నోరు పెగలదు. విషయం అర్థం కాదు. అవగాహన లేదు. ఇదీ ఆ పార్టీ నేతల దౌర్బాగ్య పరిస్తితి
పసుపు బోర్డుపై అన్వేష్ రెడ్డి ఏమన్నాడంటే…
– పసుపు ఎకరానికి 10 క్వింటాళ్లు రాలేని పరిస్థితి ఉంది. మార్కెట్లో మాడల్ ధర 7125 ఉంది. పూర్తి స్థాయిలో మార్కెట్ కి పసుపు వస్తే ధర తగ్గిపోతుంది
– ప్రతి సంవత్సరం మొదట్లో ఉన్న ధర తర్వాత ఉండటం లేదు. ఇప్పుడు ఉన్న ధర తో పెట్టిన పెట్టుబడి కూడా రాదు
– ఎగుమతులు మొదలు పెట్టడం వల్లే పసుపు ధర పెరిగింది అని అరవింద్ చెప్పడం అర్థం లేని మాట
ఎప్పటి నుండో ఎగుమతులు ఉన్నాయి కొత్తగా ఈయన చేసింది ఏమి లేదు
– ప్రాంతీయ కార్యాలయం వలన బోర్డు కంటే ఎక్కువ పసుపు రైతులకు లాభం వస్తుంది అని చెప్పే అరవింద్ మరి ఎందుకు ధర రావడం లేదు చెప్పాలి. ప్రాంతీయ కార్యాలయం వలన పసుపు రైతులకు ధర రాదు. ప్రాంతీయ కార్యాలయం కు 40 శాతం నిధులు తెచ్చిన అని చెప్పే అరవింద్ దాని వల్ల ధర ఏమైనా పెరిగిందా
– పసుపు బోర్డు వల్లే పసుపు రైతులకు మేలు జరుగుతుంది. ఇచ్చిన హామీ ని నెరవేర్చే దమ్ము లేక మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నాడు.
– అరవింద్ రాజకీయాల్లో కి రాకముందు నుండే ఎగుమతులు, ప్రాంతీయ కార్యాలయం తో పసుపు యంత్రాలకు సబ్సిడీలు అనేది ఉంది.
– తెలంగాణలో ఒక సామెత ఉంది మాట మీద నిలబడనోడు మనిషే కాదు అని. మాట మీద నిలబడలేని అరవింద్ పార్లమెంట్ సభ్యునిగా వుండే అర్హత లేదు.
– పసుపుకు 15 మద్దతు ధర కల్పిస్తేనే కొంత లాభం జరుగుతుంది. కిసాన్ కాంగ్రెస్ పసుపు రైతుల పక్షాన పోరాటం చేస్తుంది.