ఈటెల రాజేందర్ నుండి
తిన్మార్ మల్లన్న వరకు బిజెపిలో
చేరుతున్న బిసి నాయకులు,
కేసీఆర్ ప్రభుత్వంపై కోపంతో
బిజెపిలో చేరుతున్నవారు
ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు
చెప్పాలి…

బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న
బిసి వ్యతిరేక విధానం కనిపించడంలేదా..?

దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన విషయం తెలితయదా…?
దేశ జనాభాలో 60 శాతమున్న బిసిల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో 50 % రిజర్వేషన్లు కల్పించారని
బిసి నాయకులు బిజెపిలో చేరుతున్నారా…?

విద్య, వైద్యం, ఉపాధి,భూముల్లో బిసిలకు
50% అవకాశం కల్పించారని,

ఐఎఎస్,ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులుగా
బిసిలను,బిజెపి ప్రభుత్వం 50% నియమించిందని
బిజెపి లో చేరుతున్నారా బిసి నాయకులు…!

బిసి జాతిలో పుట్టి మొదటి మహిళా టీచర్ గాచరిత్ర సృష్టించిన బహుజన భారతమాత అమ్మ సావిత్రి బాయిగారిని గుర్తించి ఆమె జయంతి రోజున ఉపాద్యాయ దినోత్సవంగా గుర్తించినందుకు
బిసి నాయకులు బిజెపి లో చేరుతున్నారా…?

ప్రజల చే మహాత్మా అని బిరుదు పొందిన మహాత్మా జ్యోతి బా ఫూలే జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చినందుకా బిజెపి లో చేరుతున్నారు…
తాను కూడా బిసినే అని చెప్పుకుంటున్నా
మోదీ ప్రభుత్వం బిసి యువతకు ఉపాధి అవకాశాల కోసం చేసిన ఏ అద్భుతమైన కృష్ణని చూసి ఆకర్షితులై బిజెపిలో చేరుకున్నారు
కొంత మంది బిసి నాయకులు…
పైన పేర్కొన్న ఏ ఒక్క అంశంపై బిజెపి లో చేరుతున్న బిసి నాయకుల వద్ద సమాధానం దొరకదు…
వ్యక్తులుగా వారి వారి ఉనికి కోసమే ఉత్తర భారతం ఆధిపత్య దోపిడీ రాజకీయ పార్టీలో చేరుతున్నారు..
కొందరు బిసి నాయకులు..
ఆత్మగౌరవం ఉన్న బిసిలు ఎవరు
బిజెపిలో చేరారు…


జైభీం లాల్ సలాంలో
దండి వెంకట్
వర్కింగ్ ప్రెసిడెంట్ బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి
తెలంగాణ రాష్ట్ర కమిటీ, హైదరాబాద్.
8-12-2021

You missed