పూర్వ రంగారెడ్డి జిల్లాకు ఆది నుండి అన్యాయమే
జిల్లా పోస్టుల విభజనలో నూతన జిల్లాల స్థానికత అనే అంశం లేకపోవడం ఇటీవల ప్రకటించిన ఉద్యోగుల విభజన అంశంలో ప్రిఫరెన్స్ కేటగిరిలో అనేక అంశాలు జోడించి కీలకమైన రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నటువంటి స్థానికత మరియు క్లాజ్ 7 లో వివరించిన స్థానికత అంశం ఇచ్చిన ప్రభుత్వం ఉత్తర్వులలో చూపించకపోవడం ముమ్మాటికీ స్థానిక ఉద్యోగుల గొంతు నొక్కడం.
ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఆదినుండి ఉద్యోగుల శాతం లో స్థానికులు కేవలం దాదాపు 52 శాతం మాత్రమే ఏ జిల్లాలో లేనివిధంగా స్థానికతను తుంగలో తొక్కి రంగారెడ్డి జిల్లాలో నాన్లోకల్ దాదాపు 48 శాతం విపరీతంగా పెరిగిపోయింది. కనీసం నూతన జిల్లాల విభజన లోనైనా స్థానికత ఆధారంగా బదిలీలు చేస్తే ఇన్ని రోజులు జరిగిన అన్యాయానికి న్యాయం చేసినట్టు అవుతుంది.
అదేవిధంగా guidelines తయారు చేసే క్రమంలో తప్పనిసరిగా లోకల్ క్యాడర్ ని పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తెలపడం జరిగింది రిఫరెన్స్ లో ఉన్న అంగవైకల్యం ఇంకా మిగిలిన అన్ని కేటగిరీల ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం స్థానిక అని మాత్రం విస్మరించడం విడ్డూరంగా కనిపిస్తుంది. స్థానికత ఆధారంగా బదిలీలు చేస్తే సమయం పడుతుంది అని ఒక సాకుతో స్థానికుల గొంతు నొక్కే ప్రయత్నం మానుకోవాలని ఒక సగటు ఉద్యోగి గా మా ఆవేదన. పూర్వ రంగారెడ్డి స్థానిక కలిగినటువంటి జిల్లా లా స్థానికతను తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంది .ఇలా చేస్తే ఆలస్యం అవుతుంది … నాన్ లోకల్ వాళ్లకి ఇబ్బంది అవుతుంది అనే భావనతో …ఎవ్వరికీ న్యాయం చేయని ఉత్తర్వులను సవరించాలి ..
ఏ ఆత్మ గౌరవం కోసం అయితే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఈరోజు ఉన్న స్థానిక జిల్లాల్లో స్థానిక ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇచ్చిన ఈ ప్రభుత్వ ఉత్తర్వులు మరొకసారి పునఃపరిశీలన చేయాల్సిందిగా కోరుతున్నాను… లేనిపక్షంలో కాళోజీ గారు చెప్పినట్లు… న్యాయపోరాటానికి స్థానిక వాసులు సిద్ధం కావాలని గుర్తు చేస్తున్నాను. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రిఫరెన్స్ కేటగిరిలో మిగిలిన అన్నిటిని చేర్చినప్పుడు అందులో స్థానికత చేర్చకపోవడం కి గల కారణం ఏమిటి? అన్ని కారణాలకు క్యాన్సర్ ఉంటే,అంగవైకల్యం ఉంటే, మూత్రపిండాల రోగం ఉంటే, ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు, మా స్థానిక ఉద్యోగుల ముసలి తల్లి దండ్రులను ,కుటుంబాలకు అలాంటి వ్యాధులు లేవా? మేం ఎలా చూసుకోవాలి…
*తట్ట బుట్ట సదురు కొని వెళ్ళడానికి మేము వలస వాదులం కాదు స్థానికులం.జిల్లా స్థాయిలో తప్పనిసరిగా స్థానికత కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే..స్థానిక ఎందుకు ఇవ్వకూడదు క్లాస్ 7మరియు క్లాస్ 4 ఉన్న అంశాల్లో వారికి అనుకూలమైన అంశాలు తీసుకొని జీవో తీసుకురావడం జరిగింది. కాబట్టి రంగారెడ్డి జిల్లా స్థానిక ఉద్యోగుల్లారా ఇకనైనా మొద్దునిద్ర వీడండి ఎవరో వచ్చి మనకు న్యాయం చేస్తారని ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాంతం మనం జిల్లా కానీ జిల్లాలో కుటుంబాలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా పూర్తి సర్వీస్ గడపాల్సి వస్తుంది. ఈ అలాట్మెంట్ అనేది శాశ్వత కేటాయింపు.

ఒకసారి కేటాయింపు జరిగిన తర్వాత ఇంత ముందుకు మన స్థానిక జిల్లా పూర్వ రంగారెడ్డి జిల్లా పూర్వ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మిత్రులు అందరం వారి వారి స్థానికత ఆధారంగా మూడు జిల్లాలుగా విభజించబడినది వారికి స్థానికత ఆధారంగా వీలును బట్టి నచ్చిన జిల్లా ఎంచుకునే ఆప్షన్ స్థానికులకు ఇవ్వాలి… అలాట్మెంట్ చేస్తే వారికి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే స్థానికత లేని జిల్లాలో జీవితాంతం ఉద్యోగం చేయాల్సి వస్తుంది సరైన సమయంలో స్పందించకపోతే తర్వాత జరిగిన ఈ పరిణామానికి మనమే కారకులం అవుతాం …
పూర్వ రంగారెడ్డి స్థానిక ఉద్యోగి
