తప్పడు వార్తలు, ఫేక్ న్యూస్, అబద్దాల ప్రచారం.. ఇవే బీజేపీకి అస్త్రాలు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా రాష్ట్ర బీజేపీ తయారయ్యింది. కేసీఆర్ ఈ రోజు ప్రెస్మీట్లో అన్నట్టుగా… నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు వారి స్టైల్. వీరు అప్పుడూ ఇప్పుడూ నమ్ముకున్నది సోషల్ మీడియానే. అందులో చేసుకునే ప్రచారమే ఆయువు పట్టు. ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. దాన్ని మిగితా టీం షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తారు. వీటిని బీజేపీనేతలు కూడా కళ్లకద్దుకుని తమ ఫేస్ బుక్కుల వాళ్ల మీద పెట్టుకుని తరిస్తూ ఉంటారు. ఇగో ఇలా అర్వింద్ లెక్క. ఓ ఫేక్ న్యూస్ ను అర్వింద్ తన వాల్‌పై పెట్టేసుకున్నాడు. ఓ ఎంపీగా ఉండీ.. అది నిజమా ..? కాదా..? అని చూసుకునే అవసరం కూడా లేదనుకున్నాడు. కేసీఆర్‌ను తిట్టేది.. ప్రభుత్వాన్ని కించపరిచేది అయితే చాలు అనుకున్నట్టున్నాడు. అది ఫేక్ అని తెలిసినా.. మనకు మైలేజీ వస్తే చాలు అనేసుకున్నట్టున్నాడు. ఇగో ఇలా ఇప్పుడు ఫేక్ వార్తల శకం నడుస్తున్నది. హుజురాబాద్‌లో ఇది మరింత పదునెక్కి.. ఇలా కొనసాగుతూ ఉంది.
