సీఎం కేసీఆర్ ఎంత చెప్పినా రైతులు మాత్రం వినడం లేదు. యాసంగిలో వచ్చే ధాన్యాన్ని కేంద్రం తీసుకోవడం లేదు కాబట్టి.. మేం కొనుగోలు కేంద్రాలు పెట్టం.. ధాన్యం సేకరించం..అని నిన్న ఖరాఖండిగా చెప్పేశాడు కేసీఆర్. కేంద్రం అలా చేస్తే మేమేం చేసేది కాబట్టి ఆలోచించుకోండి.. బీజేపీ సందర్భం వచ్చినప్పుడు బొంద పెట్టండి అని ఉచిత సలహా ఒకటి పారేసి రైతుల ఇష్టానికి వదిలేశాడు.
ఒకవేళ వరి వేసినా.. అది మీరే ప్రైవేటుగా అమ్ముకోవాల్సిందే. మా మెడకు పెట్టకండని కూడా కేసీఆర్ డైరెక్టర్‌గా, ఇన్ డైరెక్టగా ఇంచుమించుగా గిదే ముచ్చట చెప్పాడు. కానీ రైతులు మాత్రం కేసీఆర్‌ను అంద ఈజీగా వదిలేలా లేరు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామంలో ఇగో ఇలా రైతులను అవగాహన పర్చేందుకు వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్‌ను నిలదీశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నదెందుకు అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు అంతా మేమే కొంటున్నామనే బిల్డప్ ఎందుకిచ్చావంటూ కడిగేశారు. పోయేకాలం వచ్చిందంటూ బాహాటంగానే శాపనార్థాలు పెట్టేశారు. ఇలా ఉంది క్షేత్రస్థాయిలో పరిస్థితి. కేసీఆర్ ఈ యాసంగి వరిని వదిలించుకుందామని బీజేపీని చూపినా.. రైతులు మాత్రం అటు చూడటం లేదు. మొదటిన ఉంచి కేసీఆర్‌పైనే రైతులకు గురి. మరి ఇంత చేసినవ్ కదా.. ఇప్పుడు కేంద్రం పేరు చెప్పి మమ్మల్ని ఆగం చేస్తవా..? అని నిలదీస్తున్నారు. ఇది ఇప్పట్లో సమసిపోయే ఇష్యూలా లేదు. యాసంగి వరి కత్తి కేసీఆర్ మెడకు వేలాడుతూనే ఉంది. ఇదెప్పుడు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో తెలియదు.
