స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లు, చాత‌గాని చ‌వ‌ట‌లు…. ఇవన్నీ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ వాడిన తిట్లు. మంచి ఊపునిచ్చాయి. ఉద్య‌మానికి ఊపిరిలూదాయి. ఆ త‌ర్వాత సీఎంగా ఆయ‌న తిట్ల జోలికి పోలేదు. హుందాగా ఉండేందుకే ప్ర‌య‌త్నించాడు. కానీ, ఈ మ‌ధ్య బీజేపీ నేత‌ల చేష్ట‌లు ఆయ‌న స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాయి. ఇక లాభం లేద‌ని ఆయనా త‌ను విధించుకున్న ప‌రిమితులు దాటుతున్నాడు. స‌రిహ‌ద్దులు చెరిపేసుకున్నాడు.

మొన్న ప్రెస్‌మీట్లో కుక్క‌ల కొడుకులు .. అని కొత్త‌గా త‌న నోటి నుంచి ఓ బూతు ప‌దం వ‌దిలాడు. ఈ రోజైతే బూతుల వ‌ద‌ర పారించాడు. తిట్ల దండకం అందుకున్నాడు. ఆంధ్ర‌లో బోసిడీకే తిట్టుతో దుమారం రేగింది. దీనిపై కొద్ది రోజులు చ‌ర్చ జరిగింది. ఇక్క‌డా బీజేపీ ఎంపీ అర్వింద్ బూతుల‌కు దిగుతున్నా.. టీఆరెస్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అంత చ‌ర్చ‌కూ దారి తీయ‌లేదు.

కేటీఆర్ ఇక‌పై ఈట్‌కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే ఇవ్వాల‌ని పిలుపునిచ్చిన త‌ర్వాత మంత్రి మ‌ల్లారెడ్డి మొద‌లు.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి వ‌ర‌కు బూతుల‌కు దిగారు. ప‌రుష ప‌ద‌జ‌లాలు వాడారు. కానీ ఈ రోజు సీఎం మాట్లాడిన మాట‌ల్లో అల‌వోక‌గా, అవ‌లీల‌గా దొర్లిన బూతులు…. చ‌ర్చ‌కు దారి తీశాయి. ఏకంగా కేంద్ర మంతి కిషన్ రెడ్డిని రండా మంత్రి అన్నాడు. రండా అంటే ..తెలంగాణ‌లో మొగుడు చ‌చ్చిన ఆడ‌ది, హిజ్రా అనే అర్థాలొస్తాయి. చూతే మంత్రి అని మ‌రో బూతు ప‌దం కూడా వాడాడు. ఇది కేసీఆర్ ఆక్రోషానికి, ఫ్ర‌స్టేష‌న్‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

ఎవ‌రో విలేక‌రి అడిగిన రైతు బీమా గురించి ఏదో అడిగితే ఏవ‌డ‌న్నాడు పిస ముండాకొడుకు అని మ‌రో తిట్టుతో అర్సుకున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు చూసీ చూడ‌న‌ట్టుగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్ర‌తీ మాట‌కు స్పందిస్తున్నాడు. త‌న‌ను తిడితే.. నింద వేయాల‌ని చూస్తే గ‌ట్టిగానే స‌మాధానం ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాడు. దీని కోసం తిట్ల దండ‌కాన్నీ ఇక‌పై ఇలాగే విరివిగా వాడాల‌నీ ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో తిట్లు నేత‌ల నాలుక‌ల‌పై అలా నాట్య‌మాడుతూ ఉంటాయ‌న్న‌మాట‌.