ఎమ్మెల్సీగా క‌విత మ‌రోసారి ఎన్నిక‌య్యారు. ఈ రోజు ఆమె ఏక‌గ్రీవంగా ఎన్నిక‌యిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించాడు. ఆమె మ‌రోసారి ఎమ్మెల్సీ కావడం, త్వ‌ర‌లో కేబినెట్‌లో బెర్త్ ఖ‌రార‌వుతుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో జిల్లా రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా మార్పులు వ‌చ్చాయి. జిల్లాలో ఏ స‌మ‌స్య ఉన్న ఆమె వ‌ద్ద‌కు వెళ్లి విన్న‌వించుకోవ‌డం ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అల‌వాటు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కొన్ని ప్ర‌తిప‌క్షాలు కూడా ఆమె నోటీస్‌కు తీసుకెళ్తారు. ఆమె మ‌ళ్లీ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారుతున్నార‌నే ప‌రిణామ‌లు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్నిచ్చింది. ఆమె ఏక‌గ్రీవంగా గెల‌వ‌గానే స‌మ‌స్య‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు సీపీఎం శ్రేణులు. డ‌బుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల గురించి ఆమెకు విన్న‌వించారు. విన‌తిప‌త్రం ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. త‌ర్వాత పూల‌బోకేతో శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌పై పేరుకుపోయిన అన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం క‌విత‌క్కే పెద్ద దిక్కు కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో నేత‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త్వ‌ర‌లో క‌విత మంత్రి అయితే మ‌రింత అభివృద్ధి జ‌ర‌గుతుంద‌ని, స‌మ‌స్య‌లు స‌త్వ‌రం ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని భావిస్తున్నారంతా.

సీపీఎం విన‌తి ప‌త్రం సారాంశం ఇదీ…
…………………………………………………………………………….
నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపట్టాలని ఎమ్మెల్సీ కవితకు సిపిఎం విజ్ఞప్తి.

నిజామాబాద్ జిల్లా నుండి ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, మరియు జిల్లా నాయకులు పెద్ద వెంకట్ రాములు, నూర్జహాన్, సబ్బని లతా, మల్యాల గోవర్ధన్ మరియు విగ్నేష్ మహేష్ తదితరులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నిజాంబాద్ జిల్లాలో అనేక సంవత్సరాలుగా నిరుపేదలు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తులు పెట్టుకొని అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి వేసారి పోతున్నారని అటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయకపోవడంతో అసాంఘిక శక్తులకు నిలయంగా మారిందని అన్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను కొంత మంది అక్రమార్కులు కబ్జాలు చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని అటువంటి భూములను పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు ఐదున్నర లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఇట్లు,
ఏ రమేష్ బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి

You missed