ఇద్దరూ ఉద్యమకారులే. ఈటల రాజేందర్.. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు గురువు. గురువు మీదే పోటీకి దింపాడు కేసీఆర్. మంచి వక్త కాకపోయినా.. ఉద్యమ నేపథ్యం కలిసిసొస్తుందని అనుకున్నారు గెల్లు విషయంలో. వెనుక కొండంత అండగా హరీశ్ ఉండనే ఉన్నాడు. అసలు ఎక్కడైనా గెల్లు మాట్లాడాడా..? ఆయన స్పీచ్ ఎవరన్నా విన్నారా? లేదు.
అంతా తానై నడిపించాడు హరీశ్. కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎలాగైనా గెలిచి విజయతీరాలకు చేరుతానని గెల్లు అనుకున్నాడు. కానీ ఉద్యమ కారులంతా ఈటల వైపే నిలిచారు. ఈటలకే విజయం వరించింది. చివరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న గెల్లు గొల్లుమన్నాడు ఇలా. ఏడుపు ఆపతరం కాలేదు ఎవరికి. రాక రాక వచ్చిన అవకాశమే. గెలిస్తే లైఫ్ సెటిలయ్యేది. నిజమే.మళ్లీ పార్టీలో నిన్ను ఎప్పుడు పట్టించుకుంటారో తెలియదు.
కొద్ది రోజుల్లోనే నిన్ను మరిచిపోతారు.. ఇది కూడా నిజమే. నీ ఏడుపులో అర్థం ఉంది. కానీ ఏడవటం పరిష్కారం కాదు.. నీకోసం మళ్ల ఆ ఉద్యమకారులే కొట్లాడతామంటున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చేదాకా. ఎమ్మెల్యే కోటాలో గెల్లును ఎమ్మెల్సీ చేయాల్సిందేనని పోరాడతామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పోరాడు బ్రదర్.. పోరాడితే పోయేదేమీ లేదు..నీ బానిస సంకెళ్లు తప్ప… నీకింకా మస్తు లైఫ్ ఉంది.. అప్పుడే డీలా పడిపోకు.