పొద్దున్నుంచి టీ న్యూస్ ఫాలో అయ్యారు టీఆరెస్ అభిమానులు. ఎందుకంటే వాళ్లిచ్చే వార్త‌ల్లో ఓ నమ్మ‌కం ఉంది. ఎలాగైనా గెలుస్తాం.. కొద్ది సేపు ఓపిక ప‌ట్టండ‌నే విధానం బాగా న‌చ్చింది. వేరే ఏవో ఛాన‌ళ్లు చూసి మ‌న‌సు పాడుచేసుకుని బాధ‌ప‌డే బ‌దులు.. కొంచెం ఆల‌స్య‌మైనా స‌రే.. మ‌న టీఆరెస్సే గెలుస్తుంద‌నే ధీమా అటు టీవీ యాంక‌రు.. టీవీ డిబేట్ల‌కు వ‌చ్చిన వ‌క్త‌లు చెప్పడం కొంచెం మ‌న‌సుకు ఊర‌ట‌నిచ్చింది. కానీ అలా చూస్తూనే ఉన్నాం.. రౌండ్ రౌండ్‌కు టీఆరెస్ వెనుక‌బ‌డ‌టంతో గుండె గ‌తుక్కుమంటూ వ‌స్తున్న‌ది.

చివ‌ర‌కు ఇంకా రౌండ్లు మిగిలి ఉండ‌గానే.. టీ న్యూస్ అనుకోకుండా ఈ వార్త‌లు బంజేసింది. ఇదేందీ..? ఇంత భ‌రోసా ఇచ్చి ఇలా ఆఖ‌ర్ల బ‌జార్ల నిల‌బెడ‌తారా..? వేరే చాన‌ళ్లు చూసే ధైర్యం లేదు.. వాళ్ల హంగామా చూస్తే మామూలుగా ఉండదు. మీరు క‌రెక్టుగా ఇస్తారు.. మ‌న చాన‌ల‌ని చూస్తే.. ఇదేందివ‌య్యా మ‌ధ్య‌లోనే బంజేసిండ్రు…మేం ఏం అనుకోవాలె.. ఓడిపోయంద‌నుకోవాలా.?? ఘోరంగా ఓడిపోయింద‌నుకోవాలా?

అస‌లు ఇది ఎన్నికే కాదు.. అంతా తొండి అని స‌ర్దిచెప్పుకోవాలా..? ఆ ముచ్చ‌ట కూడా మీరే చెప్పి ముగిస్తే మ‌న‌సుకు జ‌ర స్వాంత‌న చేకూరుతుండే.. అయినా మ‌న టీవీ అని మిమ్మ‌ల్ని న‌మ్ముకున్నాం జూడు..

You missed