కేటీఆర్ కొత్త స్టెప్ తీసుకున్నాడు. ఓపిక నశించిందన్నాడు. ఇక ఉపేక్షించేది లేదంటున్నాడు. ఏడేళ్లు ఓపిక పట్టినం ఇక మా తడాఖా చూపిస్తామని.. ఈట్‌కా జవాబ్ పత్తర్ సే .. ఇస్తామని కూడా ప్రకటించాడు. నిన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కార్యకర్తల మీటింగులో మాట్లాడాడు. అంతకు ముందు ఓ ప్రెస్‌మీట్‌లో కూడా ఇదే చెప్పాడు. పనిలో పనిగా మంత్రి మల్లారెడ్డిని మెచ్చకున్నాడు. ఎంతో ఉత్సాహాన్నిచ్చాడట కార్యకర్తలకు ఆయన. మొన్న రేవంత్‌రెడ్డిని తిట్టినందుకు ఈ మాటన్నట్టున్నాడు.
- ఇకపై కేటీఆర్‌తో మెప్పు పొందాలన్నా.. ప్రశంసలు దక్కాలన్నా.. ప్రతిపక్షాలను ఎంతగా తిడితే అంత మంచిదనే సంకేతాలిచ్చాడు కేటీఆర్.
- ఇక ఉపేక్షించేది లేదు.. అని పదే పదే పదిసార్లు.. ప్రస్టేషన్‌లో మాట్లాడినట్టుగానే ఉంది కానీ.. ఓ హుందారాజకీయం నడిపే యువనాయకుడి దోరణి కనిపించలేదు.
- కేటీఆర్ మాటల్లో ఆవేశం.. కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి సందేశాలనిస్తున్నదో తెలుస్తూనే ఉన్నది. మంత్రి మల్లారెడ్డిని ఆకాశానికెత్తడం అంటే… ఎంతలా కేటీఆర్ అలాంటి దోరణి అందరూ అలవర్చుకోవాలని కోరుకుంటున్నాడో అర్థమవుతున్నది.
- రెండు సార్లు మంత్రి తలసాని వద్దంటున్నాడు.. అలా మాట్లాడొద్దంటున్నాడు.. అని ఆయనకు మంచి మార్కులేసే విధంగా మాట్లాడాడు కేటీఆర్. పాత వీడియోలు, కేసీఆర్‌ను తిట్టిన వీడియోలు.. ఆయన రాజకీయ హుందాతనం గతంలో అందరూ చూసిందే. ఇప్పుడు మళ్లీ ఆయనకు ఏదో పెద్దరికాన్ని ఆపాదించి కేటీఆర్ మాట్లాడటం తనను తాను చిన్నగా చేసుకోవడమే అవుతుంది.
- ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలను జనాలంతా ఎంజాయ్ చేయడం లేదు. ఏవగించుకుంటున్నారు. ఆ తిట్లు మేమెందుకు పడాలి? మీరు ఒక్కటంటే… మేం పదంటాం అని రేంజ్‌లో కేటీఆర్ స్పందించడమే వాళ్ల ఉచ్చులో పడ్డట్టు లెక్క. ఆవేశంతో కాకుండా వివేకంతో మాట్లాడాల్సిన చోట.. ఆవేశానికే కేటీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తానంటున్నాడు.
- టీఆరెస్ సోషల్ మీడయాను పట్టించుకోకుండా, వారిని ప్రోత్సహించకుండా.. ఇప్పడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా .. కార్యకర్తలను, నాయకులను ఉసిగొల్పడం.. పరిస్థితి అదుపు తప్పించుకునేలా చేసుకోవడమే తప్ప మరొకటి కాదు.
- టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా మటుకు సబ్జెక్టు ఓరియంటెడ్‌గా, సందర్భానుసారం విమర్శిస్తున్నారు. వారంతా స్వచ్చంధంగా చేస్తున్నారు. కానీ పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ముందు వాళ్లపై దృష్టి పెడితే బాగుంటుంది.
- కేటీఆరే ఇలా వేదికల మీదే ఇక ఉపేక్షించం.. కాస్కోండి అనే రేంజ్‌లో మాట్లాడితే.. ఇక తెలంగాణ రాజకీయాల్లో నిత్యం దూషణలు, పరస్పర మాటల దాడులే ఉంటాయి. నిర్మాణాత్మక విమర్శలుండవు. అన్నీ ఒక్కతాను ముక్కలే అవుతాయి.