అరకిలో పంచదార తెచ్చుకోవడానికి #అరకిలోమీటర్ లైన్లో నిలబడిన రోజులు మర్చిపోయారా…?

మరో పదినిమిషాల్లో ఇంటికి వెళ్లకపోతే రోడ్డు మీద నడ్డి మీద పడే #దెబ్బల రోజులు మర్చిపోయారా..?

టివీలు పెడితే #చావుల గోల , కిటికీలు తీస్తే అంబులెన్సుల రొద రోజులు మర్చిపోయారా…?

పక్కింటోళ్లు #దగ్గిన సౌండ్ వినబడితే మన ఇంట్లో చెమటలు పట్టిన రోజులు మర్చిపోయారా…?

బెడ్ల కోసం రికమండేషన్లు , ఊరెళ్లడానికి పర్మిషన్లు ,అయినవాళ్ల కోసం #టెన్షన్లు పడినరోజులు మర్చిపోయారా…?

చేతిలో డబ్బులు ఐస్ క్యూబ్స్ లా కరిగిపోయి..
దాచుకున్న బంగారం కాగితంలా కాలిపోయి…
ఉప్పు కొనడానికి కూడా #అప్పుపుట్టని రోజులు మర్చిపోయారా…?

సాయంత్రంవేళ ఆకాశంలో పక్షులను చూస్తూ ఇంకెన్నాళ్లు ఈ #పంజరంలో పడిగాపులు అని మూగరోధించిన రోజులు మర్చిపోయారా‌‌…?

అయినవాళ్లు పోయినా వెళ్లలేక , పోతే అయినవాళ్లు రాక .. కళ్లుముందు తిరిగినోళ్లు కనురెప్ప మూసే సమయంలో కన్నుమూశారన్న వార్తలు విని #ఏంజీవితం రా ఇది అని గుండెలవిసేలా మౌనంగా ఏడుస్తూ భయపడుతూ గడిపిన రోజులు మర్చిపోయారా…?

ఏం తోచక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలిసినోళ్లు తిరిగిరారనే #పోస్టులు చూసి గుండెలు గుబేలుమన్న రోజులు మర్చిపోయారా…??

ఒక ఏడాది అంటే మర్చిపోయారనుకుందాం…
రెండేళ్లుగా చిత్రవధ అనుభవిస్తూ…
ఈ వేవ్ లో బ్రతికిబట్టకడితే చాలు అనుకున్న మనుషులేనా మీరంతా….

ఏంటీ #మతరాజకీయాలు..?? ఏంటి #పండుగల గోలలు…
మూడోవేవ్ ఉందని భయపడడం మానేశారా..? పోతేపోయాం వెదవజీవితం అని ఫిక్సయ్యారా..?
పండుగలు #ఇంట్లో చేసుకోకుండా #రోడ్డెక్కుతాం అంటున్నవాళ్లు.. ప్రభుత్వాసుపత్రులలో బెడ్ కోసం హై రికమండేషన్ చేసుకోవాలని మర్చిపోయారా..?

ప్రభుత్వాలదేముంది బ్రదర్.. పర్మిషన్లు ఇస్తే రేపు పోయేది మనం… మనం పోతే అది #కౌంట్ లోకి వస్తుందో రాదో కూడా తెలియని చావు అది….
.
.
.
#Note:
నేనూ , నా ఫ్యామిలి , నావాళ్లు ఇక సేఫ్ అనేరోజులు వచ్చేవరుకు నాకు ఏ పండుగలు వద్దు ,ఏ ధియేటర్లు వద్దు , ఏ ఫంక్షన్లు వద్దు….

తప్పదు అనుకుంటే మాస్కులు , శానిటైజర్లు తో రోజులు నెట్టుకురావాలి…

ఇది భయం కాదు‌… జాగ్రత్తకాదు… ఆ పాతరోజులు మళ్లీ రావద్దనే స్వార్ధం మాత్రమే…

-✍🏾 బెజవాడ సాయి

You missed